ఈ మూమెంట్ కోసం పాతికేళ్ల ఎదురుచూపులు | Took 25 years for SRK Aamir to pose together.

Srk aamir click a selfie

Shah Rukh Khan Aamir Khan, Shah Rukh Khan Selfie, SRK Aamir Khan Selfie, Bollywood Sensation Selfie, SRK 25 years, ARK Aamir Selfie, Aamir Khan Selfie, Sharukh Khan sahred Pic, Bollywood Superstars Selfie, Best Selfie Moment

Sharukh Khan sahred Pic with Aamir Khan. Took 25 years for both to pose together. Shah Rukh tweeted "Known each other for 25 years and this is the first picture we have taken together of ourselves. It was a fun night,".

అమీర్-షారూఖ్ సెల్ఫీ సెన్సేషన్

Posted: 02/11/2017 03:01 PM IST
Srk aamir click a selfie

బాలీవుడ్ లో లెజెండరీ నటులు ఎంత మంది ఉన్నా ఖాన్ త్రయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఎప్పటికప్పుడూ వీరిలో ఎవరో ఒకరు లీడ్ తీసుకుని రికార్డులు నెలకొల్పుతుంటారు. గత కొంత కాలంగా షారూఖ్ ప్రాభావం తగ్గినప్పటికీ, సల్మాన్, అమీర్ లు మాత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేగొడుతూనే ఉంటున్నారు. అయితే ఎంత త్రయం అన్న పేరున్నప్పటికీ, వీరిమధ్య చిన్న చిన్న గ్యాప్ లు కూడా ఉన్నాయన్నది ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. అమీర్, షారూఖ్ విషయంలో అయితే ఇది మరీనూ.

అయితే ఈ మధ్య పరిస్థితులు చాలా మారిపోయాయి. మునుపెన్నడూ లేని విధంగా అమీర్ చిత్రానికి కూడా పాజిటివ్ కామెంట్ చేసి సెన్సేషన్ అయ్యాడు షారూఖ్. అఫ్ కోర్స్ ప్రతిగా రయిస్ ను కూడా అమీర్ పొగిడాడనుకోండి. కానీ, పాతికేళ్లలో జరగని ఓ వండర్ ఇప్పుడు అక్కడ హల్ చల్ చేస్తోంది. అదే బాద్ షా అండ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ సెల్ఫీ.

అవును.. పాతికేళ్లలో ఈ ఇద్దరూ ఇలా ఫోజు ఇచ్చిన దాఖలాలు లేవని స్వయంగా చెబుతూ తన ట్విట్టర్ లో ఫోటో షేర్ చేశాడు షారూఖ్. శుక్రవారం ప్రముఖ వ్యాపారవేత్త అజయ్ బిజిలి దుబాయ్ లో ఇచ్చిన బర్త్ డే పార్టీకి వీరిద్దరూ హాజరయ్యారు. అక్కడ ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇలా క్లిక్ మనిపించారన్నమాట. బోలెడంత గెడ్డం పెంచిన ఆమిర్.. కుర్రాడిలా మారిపోయిన షారూక్ ఇందులో కనిపిస్తారు. పైగా వాట్ ఏ ఫన్ నైట్ అంటూ కామెంట్ కూడా చేశాడు షారూఖ్. మరి ఈ సూపర్ స్టార్ ల ఫోటో సెన్సేషన్ కాదంటారా చెప్పండి?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sharukh Khan  Aamir Khan  Selfie  

Other Articles