నాని... ది రియల్ రైజింగ్ స్టార్ | Nani Nenu Local Surprising Collections.

Nenu local first day collections

Nani, Nenu Local, Nenu Local Day 1 Collections, Nenu Local Collections, Nenu Local Business, Nenu Local First Day Collections, Nenu Local Movie, Nenu Local, Nani Stardom, Nenu Local First Day Collections

Nani Nenu Local opening day figure Surprising all. The Natural Star Movie Colletions rising on day 2.

నాని లోకల్ కలెక్షన్లతో కుమ్మేశాడు

Posted: 02/04/2017 02:05 PM IST
Nenu local first day collections

టాలీవుడ్ లో ప్రస్తుతం మొత్తం నాని హవానే కొనసాగుతోంది. మిగతా స్టార్లలా అభిమాన సంఘాలు లేకపోయినా, అన్ని వర్గాలు అతన్ని ఆదరిస్తుంటాయి. సోషల్ మీడియాలో, థియేటర్ల దగ్గర హడావుడి లేకపోయినా హౌస్ ఫుల్ కలెక్షన్లతో సినిమా రన్ అయ్యి తీరుతుంది. అలాంటి నాని టాలీవుడ్ లో బడా స్టార్లకు సైతం సాధ్యపడని రేర్ ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే డబుల్ హ్యాట్రిక్.

ఈగ తర్వాత మనోడి స్టార్ డమ్ మారిపోతుందని అంతా భావించినప్పటికీ, వరుస ఫ్లాపులు పడ్డాయి. అయినా ఢీలా పడిపోనీ యంగ్ హీరో ఎవడే సుబ్రహ్మణ్యంతో తన సక్సెస్ జర్నీ మొదలుపెట్టాడు. వరుసగా ఐదు హిట్లు అందించి ఇప్పుడు నేను లోకల్ తో ఆరో సక్సెస్ ను అందుకున్నాడు. ఓవైపు క్లారిటీ లేని రివ్యూలు వెలువడుతున్న సమయంలో సినిమా గురించి సాయంత్రం దాకా, ఒక్కోసారి వీకెండ్ అయ్యేదాకా కూడా స్పష్టమైన రిజల్ట్ తెలియటం లేదు. అలాంటిది ఫస్ట్ డే ఫస్ట్ షో కే హిట్ టాక్ సొంతం చేసుకోవటం ఒక్క నాని సినిమాకే సొంతం అయ్యింది.

ఫ్యాన్స్ ఫీవర్ కు అతీతంగా ఇప్పుడు నాని సినిమాకు కలెక్షన్లు పెరిగిపోతున్నాయి. ట్రేడ్ లెక్కల ప్రకారం తొలిరోజు సుమారు 5.5 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 4 కోట్లు తెలుగు రాష్ట్రాల్లోనే దక్కించుకున్నాడు నాని. ఓవర్సీస్ లో యూఎస్ లో ఫస్ట్ డే కలెక్షన్లు డబుల్ రాబట్టడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. వరుస హిట్లతో దూసుకుపోతున్న నాని ప్రస్తుతం ఉన్న టాప్ హీరోల పొజిషన్ కు ఎర్త్ పెట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు సినీ విశ్లేషకులు. ప్రస్తుతానికైతే నేను లోకల్ కలెక్షన్లు దూకుడు ఎలా ఉండబోతుందా? అంటూ ఎదురు చూస్తున్నారు.

 

Top 5 USA Premiere Gross for Nani:

# NenuLocal - USD 160,716
# Gentleman - USD 72,418
# BBM - USD 70,132
# Majnu - USD 58,370
# Eega - USD 42,408

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Nenu local  First Day Collections  

Other Articles

Today on Telugu Wishesh