మీలో ఎవరు కోటీశ్వరుడు.. నాగ్ ప్లేస్ లో చిరు... అసలు కారణం ఇదే | Why Chiru replace Nagarjuna in MEK.

Reason behind nagarjuna out of mek

Akkineni Nagarjuna MEK, MEK 4, Nagarjuna Out Of MEK, Nagarjuna Meelo Evaru Koteeswarudu, Meelo Evaru Koteeswarudu Chiranjeevi, Meelo Evaru Koteeswarudu season 4, Meelo Evaru Koteeswarudu Chiru Nagarjuna, Chiru and nagarjuna Meelo Evaru Koteeswarudu, Nagarjuna about MEK Break

Akkineni Nagarjuna himself has revealed why he had opted out of such a successful show. The senior said that his main intention was to break the monotony, which according to him was bound to come after watching the same host for as many as 3 seasons. 'People could guess my reaction even before I let it out as they have seen me in 180 episodes continuously. It could kill the enthusiasm of watching the show so on the last day of MEK3 shoot, I announced my decision of quitting or taking a break for 1-2 seasons at least he added.

మీలో ఎవరు కోటీశ్వరుడు ఎందుకు వదిలేశాడంటే...

Posted: 02/02/2017 03:03 PM IST
Reason behind nagarjuna out of mek

బుల్లితెర పై సంచలన టీఆర్పీతో ఓ ఊపు ఊపిన అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతికి రీజియనల్ వర్షన్ మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని ఓ ప్రముఖ ఛానెల్ ప్రసారం చేసిన విషయం తెలిసిందే. మూడు సీజన్లకు అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించగా, నాలుగో సీజన్ కు మాత్రం మెగాస్టార్ చిరంజీవితో హోస్టింగ్ చేయించబోతున్నారు. అయితే పర్సనల్ కారణాలతోనే నాగ్ షో నుంచి తప్పుకున్నాడంటూ ఆ మధ్య ఓ పుకారు రేగింది.

దీనిపై నమో వేంకటేశాయ ప్రమోషన్ లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు నాగ్. మీలో ఎవరు కోటీశ్వరుడు నిరంతరంగా కొనసాగించాలనుకుంటున్న షో. వరుసగా 180 ఎపిసోడ్స్ లో షూట్ చేసి అలిసిపోయాను. ప్రేక్షకులు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకే ఒకటి, రెండు సీజన్లకు రెస్ట్ తీసుకోవాలనుకున్నా అంతేకానీ వేరే కారణాలేవీ లేవంటూ తెలిపాడు. ఎడతెరిపిలేకుండా నన్నే చూస్తే జనాలకు కూడా చిరాకు పుడుతందని నాకు తెలుసంటూ చాలా ఓపెన్ గా చెప్పేశాడు. అదే సమయంలో మెగాస్టార్ 150వ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చరిష్మా ఉన్న చిరు అయితేనే షోకి బాగుంటారని నేను, నిర్వాహకులు అనుకున్నాం. ఇదే మంచి సమయం అనుకుని ఆయన్ని సంప్రదించగా ఓకే చెప్పేయటం, నాలుగో సీజన్ షూట్ చేయటం జరిగిపోయాయంటూ వివరించాడు.

మీలో ఎవరు కోటీశ్వరుడు చాలా ఓపికగా చేయాల్సిన షో అది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6, 7 దాకా చేసే వాడిని. వాళ్లు అడిగే ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం చెప్పాలి. మరోవైపు నేను ఎలాంటి ఉద్రేకానికి లోను కాకూడదు. ఓవైపు సినిమాలు, మరోవైపు ఇంట్లో శుభకార్యాలు. వీటిని బ్యాలన్స్ చేసుకుంటూ ఆ షోను చేయాలంటే కొంచెం కష్టమే కదా. అందుకే రెస్ట్ తీసుకున్నా అంటూ వివరించాడు నాగ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Meelo Evaru Koteeswarudu  Season 4  Akkineni Nagarjuna  Chiranjeevi  

Other Articles