బాలయ్య 40 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించాడా? | TSR praised Shatachitra Yodha Balakrishna.

T subbirami reddy felicitated entire satakarni team

T Subbirami Reddy, Gautamiputra Satakarni Team Felicitated, TSR Satakarni Team, Shatachitra Yodha Balakrishna, Balayya's Veli Mudra, Krish Praise bala Krishna, TSR Felicitated Datakarni Team,

Popular industrialist, politician, film producer and philanthropist T Subbirami Reddy felicitated entire Satakarni team yesterday at Park Hyatt. "Satakarni is a prestigious 100th project for Balakrishna which will remain fresh in annals of Telugu film history even after 40 years just like Dana Veera Shura Karna happened for legendary NTR," TSR praised. Krish says Balayya's ‘Veli Mudra’ (finger print) on Telugu cinema canvass

టీఎస్సార్ ఆధ్వర్యంలో శాతకర్ణి టీంకు ఘన సన్మానం

Posted: 01/31/2017 11:43 AM IST
T subbirami reddy felicitated entire satakarni team

చారిత్రక విజయంగా టాలీవుడ్ లిస్ట్ లో చేరిపోయిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విజయోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. సినీ నిర్మాత, రాజకీయవేత్త, వ్యాపారవేత్త టి.సుబ్బరామిరెడ్డి హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో చిత్ర యూనిట్ కు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. జయసుధ, తమన్నా లాంటి వాళ్లతోపాటు కావూరి సాంబ శివరావు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు, సోదరి పురంధేశ్వరి తదితరులు హాజరయ్యారు. అయితే ఇందులో బాలయ్య కుటుంబం ఈ పార్టీలో హైలైట్ గా నిలిచింది. భార్య వసుంధర, కుమార్తెలు బ్రాహ్మిణి, తేజస్వినిలతో కలసి బాలయ్య రాగా, క్రిష్ తన భార్య రమ్యతో హాజరయ్యాడు.

ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి బాలయ్యపై ఓ రేంజ్ లోనే పొగడ్తలు కురిపించాడు. లెజెండరీ నటుడు ఎన్టీఆర్ నటించిన దాన వీర శూర కర్ణ వచ్చినా 40 సంవత్సరాల తర్వాత తిరిగి శాతకర్ణితో బాలయ్య అటువంటి చరిత్రనే సృష్టించాడంటూ తెలిపాడు. మరోవైపు శాతకర్ణి లాంటి సినిమాను తెలుగు తెరకు అందించిన బసవతారకరామపుత్ర బాలకృష్ణ గారికి నా కృతజ్నతలు అంటూ దర్శకుడు క్రిష్ తెలిపాడు. సాధారణంగా ఏ రెండు వేలి ముద్రలు ఒకేలా ఉండవు. అందుకే శాతకర్ణితో తెలుగు సీమలో ఓ ప్రత్యేక ముద్ర ను వేయించాలని భావించానని, అది బాలయ్యతోనే సాధ్యమైందన్నాడు. తన 99 సినిమాల అనుభవాన్ని కలిపి నట విశ్వరూపం చూపించాడంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.

తన తండ్రి ఎన్టీఆర్ చేయాలనుకున్న రోల్ ను తాను చేయటం భగవంతుడి ఆశీస్సులని, ఆ పాత్రలో తాను చేసి తన తండ్రి రుణం తీర్చుకున్నానని బాలయ్య చెప్పాడు. అవకాశం కల్పించిన దర్శకుడు క్రిష్ కి, నిర్మాతలకు, తమ కృషిని గుర్తించి ప్రోత్సహిస్తున్న సుబ్బిరామిరెడ్డికి కృతజ్నతలంటూ తెలిపాడు. మరోవైపు బాలయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ... 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా చూసి తామంతా గర్వపడుతున్నామన్నారు. దే వేడుకలో దర్శకుడు క్రిష్.. ఆయన భార్య రమ్యలకు బోలెడన్ని ప్రశంసలు లభించాయి. కొత్త పెళ్లి జంట అయినా.. ఈ చిత్రం కోసం వారు పడ్డ తపన అసామాన్యం అన్నారు అతిథులు. చివర్లో బాలయ్య దేశం మీసం తిప్పుదాం డైలాగుతో ఒక్కసారిగా హుషారు పెంచాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautamiputra Satakarni  Felicitated  TSR  

Other Articles