దారుణం: అమితాబ్ ను చంపేశారు.. అంతా పాక్ పనే | Pakistan media published Amithabh death fake news.

Amitabh bachchan fake death news viral

Amitabh Bachchan, Amitabh Bachchan Dead, Amitabh Bachchan Death news, Amitabh Bachchan Fake Dead, Fake Death news, Big B fake death news, Megastar’s death hoax, Amitabh Bachchan death hoax, Amitabh Bachchan Pakistan media

Amitabh Bachchan Dead, this time on Facebook! Megastar’s death hoax goes viral with this old picture of Big B!.After Aishwarya Rai Bachchan now its Amitabh turn.

సోషల్ మీడియాలో అమితాబ్ పై ఫేక్ న్యూస్

Posted: 01/20/2017 03:24 PM IST
Amitabh bachchan fake death news viral

నిక్షేపంలా ఉన్న మనుషులను పట్టుకుని చనిపోయాడంటూ వార్తలు రావటం కొత్తేమీ కాదు. అయితే జనాలు కూడా ఎంత వరకు వాస్తవం అన్నది ఆలోచించకుండా వాటిని వైరల్ చేయటమే ఇక్కడ అసలు సమస్య. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? ఈసారి ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పైనే ఆ వార్త వచ్చింది కాబట్టి.

ఇక్కడో ఫోటో చూడండి. అమితాబ్ ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడు. పక్కన తనయుడు అభిషేక్ బచ్చన్ ఏదో ఆస్పత్రిలోకి తీసుకెళ్తున్నట్లు ఓ ఫోటో. ఈ రెండు కలిసి బిగ్ బీ బతికుండగానే చంపేశాయ్. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతూనే ఉంది. ముందు ఫేస్ బుక్ లోని ఓ పేజీ లో అప్ లోడ్ అయిన ఈ ఫోటో క్రమక్రమంగ వాట్సాప్ ద్వారా టోటల్ దేశం మొత్తం పాకిపోయింది. అయితే ఇంత సీరియస్ ఇష్యూలో ఇక్కడో కామెడీ ఏంటంటే చనిపోయింది ఫిబ్రవరి 23, 2016 అని రాసి ఉండటం. మొత్తానికి ముందు వెనకా చూడకుండా వ్యాపింపజేశారు.

ఇంతకు ముందు యే దిల్ హై ముష్కిల్ సినిమా రొమాన్స్ వ్యవహారంతో వివాదం చెలరేగి బచ్చన్ కోడలు ఐశ్వర్య రాయ్ ఆత్మహత్య చేసుకుందంటూ గాలి వార్తలు రావటం చూశాం. ఇప్పుడేమో ఏకంగా లెజెండరీ నటుడు ఇక లేడంటూ మరోకటి. అయితే ఇలాంటి అడ్డమైన కథనాల వెనకాల ఉంది ఓ పాకిస్థాన్ కు చెందిన వెబ్ సైట్ అని తేలటంతో నెటిజన్స్ తీవ్ర పదజాలంతో కామెంట్లు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amitabh Bachchan  death hoax  Viral  

Other Articles