మత్తు మందిచ్చి రేప్, ఆపై న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్, షారూఖ్ క్లోజ్ ఫ్రెండ్ పై కేసు | Case against Karim Morani for sexual assault.

Rape allegations and case against karim morani

Karim morani, Rape case, Producer rape case, Karim Morani Sharuh Khan, SRK Karim Morani, Karim Morani Rape Case, Karim Morani under worls links, Karim Morani Mafia, Karim Morani 2G scam, Karim Morani case, Bollywood top producer, producer in rape case

Bollywood top producer, Sharukh Khan close friend Karim morani in Rape Case. He also Karim Morani accused in 2G scam money laundering.

బాలీవుడ్ టాప్ ప్రోడ్యూసర్ పై రేప్ కేసు

Posted: 01/18/2017 04:44 PM IST
Rape allegations and case against karim morani

బాలీవుడ్ టాప్ నిర్మాత కరీం మొరానీపై అత్యాచారం కేసు నమోదయ్యింది. తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఓ బీబీఐ విద్యార్థిని కరీంపై ఫిర్యాదు చేసింది. మత్తు మందు ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని, ఆపై న్యూడ్ ఫోటోలతో తనను బ్లాక్ మెయిల్ చేస్తూ లొంగదీసుకున్నాడని ఆమె ఆరోపించింది.

దిల్ వాలే షూటింగ్ సమయంలో 2015 జూలై నుంచి తనపై మొరానీ ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని చెబుతోంది. ఆరు నెలలపాటు ఈ దారుణం కొనసాగించాడని, కుటుంబం పరువు పోతుందని తాను ఇంతకాలం సైలెంట్ గా ఉన్నానని ఆమె చెబుతోంది. అంతేకాదు అండర్ వరల్డ్ మాఫియాతో కరీం కు సత్ససంబంధాలు ఉన్నాయని కూడా చెబుతోంది. మొత్తం 4 సెక్షన్ల కింద అతనిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Kiran Morani Sharukh Khan

కాగా, కరీం బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కి అత్యంత సన్నిహితుడు. రావన్, చెన్నై ఎక్స్ ప్రెస్, దిల్ వాలే చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించాడు కూడా. అంతేకాదు 2జి స్పెక్ట్రమ్ స్కామ్ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లాడు. డీఎంకె పార్లమెంటు సభ్యురాలు కనిమొళికి 20 శాతం వాటా ఉన్న కలైంగర్ టీవీ చానెల్‌కు 200 కోట్ల రూపాయలను డిబి రియాల్టీ నుంచి బదలాయించడంలో కరీం మొరానీ సహకరించాడని సీడీఐ ఆరోపణలు గుప్పించింది. అందుకు గాను అతను ఆరు కోట్ల ముడుపులు కరీంకు అందినట్లు నివేదికలో తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood  Karim morani  Rape Case  

Other Articles

Today on Telugu Wishesh