వర్మ ట్వీట్ : శాతకర్ణిని పొగుడుతూనే ఖైదీనీ... | varma praised Satakarni.satire to Khaidi.

Varma satire on khaidi no 150

Ram Gopal Varma Khaidi No 150, RGV tweet on Satakarni, Varma widhed Balayya, Varma Mega satire, Gautamiputra Satakarni Varma Tweet, Ram Gopal Varma Khaidi no 150 tweet, Varma satire on khaidi, Varma praise, Varma Krish

Director Ram Gopal Varma Praised and Congratulate Gautamiputra Satakarni success and satire on Khaidi No 150.

వర్మ మళ్లీ మెగా సెటైర్ వేశాడు

Posted: 01/12/2017 01:16 PM IST
Varma satire on khaidi no 150

దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తన ట్వీట్ ధాటి ప్రదర్శించాడు. శాతకర్ణిని అభినందిస్తూనే, మెగా ఫ్యామిలీకి మళ్లీ చురక అంటించాడు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా ఘన విజయం సాధించటంపై ట్విట్టర్ లో స్పందించాడు. ఈ సందర్భంగా బాలయ్యను ఆకాశానికెత్తేశాడు వర్మ.

అరువు తెచ్చుకున్న కథతో తెలుగు సినీపరిశ్రమ ఖ్యాతిని తగ్గించకుండా... ఒరిజినల్ కథాంశంతో మన ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింపజేసిన బాలయ్య, క్రిష్ లకు శాల్యూట్ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో కత్తి రీమేక్ అయిన ఖైదీ నంబర్ 150పై మళ్లీ సెటైర్ వేసినట్లే అయ్యింది. ఆపై బాలయ్యకు '100 ఛీర్స్' అంటూ అభినందించాడు. "హే క్రిష్, గౌతమీపుత్రకు వస్తున్న టాక్ కు కంగ్రాట్స్. నా అంచనా ఏ మాత్రం తప్పకుండా, నా జడ్జిమెంట్ ఇంత కరెక్ట్ అయినందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది", అంటూ క్రిష్ కు అభినందనలు తెలిపాడు. తన 100వ సినిమా విజయంతో గొప్ప సినిమాల విషయంలో... బాలయ్య 150 మెగా రెట్లు ముందడుగు వేశాడంటూ వర్మ కొనియాడాడు. అంతేకాదు బాహుబలి తర్వాత శాతకర్ణి తెలుగు వారి వైభవాన్ని మరింత ముందుకు తీసుకెళ్తే, మెగా అభిమానులు గుర్తించాలంటూ సెటైర్ వేశాడు.

ఖైదీ మొదలైనప్పటి నుంచి ప్రారంభమైన ఈ రచ్చ, పోస్టర్లను కామెంట్ చేయటం, దానికి నాగబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపటం, అయినా వర్మ తన సెటైర్లను ఆపకపోవటం, ఒకానోక దశలో తారాస్థాయికి వివాదం చేరింది.వర్మ తీరు ఎవరికీ అర్థం కాదని, పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ చిరు ప్రత్యక్షంగా చెప్పటంతో వివాదం ముగిసిందనే అంతా అనుకున్నారు. అయితే మళ్లీ శాతకర్ణిని పోలుస్తూ వర్మ వేసిన ఈ కౌంటర్ పై అభిమానులు గరం అవుతున్నారు. అయితే ఇద్దరు అగ్రహీరోల సినిమాలపై వర్మ ఇలా కామెంట్లు చేయాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పైగా షోలే లాంటి క్లాసిక్ సినిమాను పాడు చేసిన నువ్వా రీమేక్ ల గురించి చెప్పేది అంటూ మెగా ఫ్యాన్స్ అయితే ఒకింత ఫైర్ అవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Satakarni Movie  tweet  Satire  Kahidi  

Other Articles