సంక్రాంతి పోటీ ఇద్దరిలో వెంకీ సపోర్ట్ ఎవరికీ? | venky supports to both top heroes in Sankranti race.

Venkatesh wishes to chiru and balayya

Venkatesh, Chiranjeevi and bala Krishna, Venky chiru and Balayya, Venky wishes Chiru and Balayya, Venkatesh supports to both, Satakarni and Khaidi Venkatesh, Venkatesh facebok, Hero Venkatesh share old pic, Venkatesh wishes both top heroes, Tollywood heroes rare pics, venky with chiru and Balayya

Victory Venkatesh wishes Chiranjeevi and bala Krishna on their land mark movie releases for Sankranti.

చిరు-బాలయ్యలకు విక్టరీ ఆల్ ది బెస్ట్

Posted: 01/10/2017 10:46 AM IST
Venkatesh wishes to chiru and balayya

టాలీవుడ్ లో సంక్రాంతి పోటీ రసవత్తరంగా మారింది. ఓవైపు మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150, మరోవైపు నటసింహ బాలయ్య వందో చిత్రం శాతకర్ణి రెండూ బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ కానున్నాయి. ఫస్ట్ డే రికార్డులపై ఇప్పటికే చిరు కర్ఛీప్ వేసుకోగా, మరోవైపు బాలయ్య కూడా పసందైన విందును అందిస్తానని అభిమానులకు హామీ ఇచ్చాడు.

అయితే హీరోలు మాత్రం ఒకరి సినిమాకు మరోకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటుంటే అభిమానులు మాత్రం కత్తులు దూసుకుంటున్నారు. ఇప్పటికే మెగా వర్సెస్ నందమూరి వార్ సోషల్ మీడియాలో వైరల్ కాగా తెలుగు రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమా గురించి తప్పుడు ప్రచారాలు చేసినా.. దూషణల పర్వం, అభిమానుల మధ్య ఫ్లెక్సీల గొడవలు జరిగితే సహించేది లేదంటూ నేరుగానే వార్నింగ్ ఇచ్చారు కూడా.

ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య ఎంత స్నేహపూర్వక సంబంధం ఉంటుందో మరోసారి నిరూపించాడు అగ్రనటుడు విక్టరీ వెంకటేష్. ఇద్దరు స్టార్ల ల్యాండ్ మార్క్ చిత్రాలకు విషెస్ చెబుతూ ఓ పోస్ట్ చేశాడు. చిరు - బాలయ్య ల సినిమాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, ఇద్దరూ గొప్ప నటులే కాకుండా తనకి మంచి స్నేహితులు కూడా అని వీళ్లని మరోసారి తెరపై చూడడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని వెంకీ తన ఫేస్ బుక్ ద్వారా సందేశం పంపించారు. ఈ సందేశానికి తోడుగా గతంలో వీరు ముగ్గురూ కలిసి ఉన్న ఫోటోని కూడా పోస్ట్ చేశాడు వెంకీ. చిరు రీసెంట్ గా తన ఇంటర్యూలో తోటి నటులైన బాలయ్య, నాగ్ గురించి స్పెషల్ గా వెంకీ చేసే ప్రయోగాల గురించి ప్రస్తావిస్తూ అభినందించటం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkatesh  Chiranjeecvi  Bala Krishna  wishes  Sankranti race  

Other Articles