తండ్రి పనితో కీర్తి సురేష్ కి ఇబ్బందులు.. ఏం చేశాడు? | Producer Suresh Kumar Clash with Exhibitors.

Keerthy suresh s father in controversy

Keerthy Suresh, Keerthy Suresh Father, Keerthy Suresh Suresh Kumar, Bairavaa Malayalam, Bairavaa Keerthy Suresh trouble, Bairavaa Movie Heroine, Bairavaa actress, Bairavaa suresh Kumar

Malayalam film strike caused by Keerthy Suresh's father to help her movie release.

వివాదంలో కీర్తి సురేష్ తండ్రి

Posted: 01/03/2017 02:06 PM IST
Keerthy suresh s father in controversy

మళయాళపు టాప్ ప్రోడ్యూసర్, నటి కీర్తి సురేష్ తండ్రి సురేష్ కృష్ణ పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కూతురి కోసం ఆయన చేస్తున్న పనే అందుకు కారణం అయ్యింది. వివరాళ్లోకి వెళ్లితే... మాలీవుడ్ నిర్మాత అసోషియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్న సురేష్ కృష్ణ క్రిస్మస్ కి రావాల్సిన సినిమాలన్నింటిని వాయిదా వేయించాడు. అంతే కాదు మరో నెల పాటు మరేయితర సినిమాలు రిలీజ్ కాకుండా తన పరపతిని వినియోగిస్తున్నాడు.

దీనిని ఖండిస్తూ ఎగ్జిబిటర్ ఫెడరేషన్ అధ్యక్షడు లిబర్టీ బషీర్ పోరాటనికి దిగాడు. సురేష్ తీసుకున్న నిర్ణయం వల్ల చిన్న సినిమాలు పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని వాదిస్తున్నాడు. అంతేకాదు ఈ నిర్ణయంపై కోర్టుకి వెళ్లేందుకు కూడా సిద్ధమైపోయాడు. అంతేకాదు దీనింతటికి కారణం కీర్తి సురేషే అని ఆరోపణలు కూడా చేశాడు.

విజయ్ హీరోగా నటించిన భైరవ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. అందులో కీర్తి సురేష్ హీరోయిన్ అన్న విషయం అందరికీ తెలుసు. ఇక కేరళలో కూడా దీనిని భారీ ఎత్తున్న రిలీజ్ చేసేందుకు సురేష్ కృష్ణ ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం 100 స్క్రీన్లకు పర్మిషన్ అయితే ఏకంగా 200 స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు యత్నిస్తున్నాడంట. అయితే బషీర్ చేస్తున్న ఆరోపణలకు అందరు ఎగ్జిబిటర్ లు మద్ధతు ఇవ్వకపోవటం కొసమెరుపు. మొత్తానికి తన సినిమా కోసం తండ్రి చేసిన యత్నంతో కీర్తిపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bairavaa  Malayalam  Keerthy Suresh  Suresh kumar  

Other Articles