2016-టాలీవుడ్ బెస్ట్ హీరో.. మెగాపవర్ స్టార్ | Ram Charan best hero of tollywood 2016

Tollywood 2016 best hero

Tollywood, Tollywood best hero, Tollywood-2016, 2016 tollywood hero, best hero 2016, tollywood best hero poll, 2016 tollywood best hero, tollywood top hero 2016, Ram Charan Dhruva best hero, Ram Charan 2016 best hero, cherry 2016 best hero, ram charan dhruva performance

Mega Power star Ram Charan won Tollywood-2016 best hero title.

టాలీవుడ్-2016 బెస్ట్ హీరో: రాం చరణ్

Posted: 01/01/2017 12:30 PM IST
Tollywood 2016 best hero

ఈ యేడాది టాలీవుడ్ టాప్ హీరో ఎవరో తేలిపోయింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ 2016కు గానూ ఉత్తమ నటుడి కిరీటం దక్కించుకున్నాడు. ధృవ సినిమాకు గానూ చెర్రీ దీనిని కైవసం చేసుకున్నాడు. ఈ యేడాదికి గానూ ఇండస్ట్రీ థర్డ్ హిట్(కలెక్షన్ల పరంగా) అందుకున్నాడు కూడా. నోట్ల రద్దులో కూడా ఈ చిత్రం ఫాస్ట్ గా 50 కోట్ల మార్కు దాటిందంటే దానికి కారణం ముమ్మాటికీ చెర్రీకున్న క్రేజే.

గత కొంతకాలంగా మూసపాత్రలు చేస్తున్నాడంటూ, కేవలం మాస్ అభిమానుల కోసమే ప్రయోగాలకు దూరంగా ఉంటున్నాడంటూ విమర్శలు వినిపించాయి. అయితే ఓ రీమేక్ తో కూడా బ్లాక్ బస్టర్ కొట్టగలనని నిరూపించాడు చెర్రీ. అల్రెడీ వేరే బాషలో హిట్ అయిన సినిమాను రీమేక్ చేయటం పెద్ద విషయమా అన్న కామెంట్లకు ప్రతికూల పరిస్థితుల్లో కూడా బ్లాక్ బస్టర్ కొట్టి తన సత్తా చాటాడు. కంటెంట్ లో డెప్త్ మిస్ కాకుండా, ఆ ఫీల్ ను పొగొట్టకుండా దర్శకుడు సురేందర్ రెడ్డిని ఎంకరేజ్ చేసి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ధృవను తెరకెక్కించి సాహసం చేశారు నిర్మాత అల్లు అరవింద్. కానీ, ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు చెర్రీ.

తన నటనపై వస్తున్న విమర్శలకు కూడా ఈ చిత్రంతో పుల్ స్టాప్ పెట్టగలిగాడు. యంగ్ అండ్ డైనమిక్ పోలీసాఫీసర్ గా పతాక సన్నివేశాల్లో ఎమోషన్, డైలాగ్ డెలివరీలో మెచ్యూరిటీ, విలన్ అరవింద స్వామితో కలిసి నటించే సన్నివేశాలలో పోటాపోటీగా, ఓవరాల్ గా అద్భుతమైన నటనతో అభిమానులను మెప్పించటమే కాదు, ఓటింగ్ లో కూడా టాప్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అందుకే తెలుగు విశేష్ ఆయనకి అభినందనలు తెలియజేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  2016  poll  best hero  ram charan  

Other Articles