పవన్ లుంగీ పోస్టర్లపై సెటైర్లు వేస్తున్నారు | Pawan Lungi irritates Fans.

Satires on pawan katamarayudu lungi posters

Katamarayudu, Pawan Kalyan, Katamarayudu New Poster, PK's lungi irritate, Katamarayudu Rowdy movie, Katamarayudu Lungis Irritating Fans, Katamarayudu new year posters, Katamarayudu links with varma movie, Katamarayudu Mohanbabu, Mohanbabu Pawan kalyan Panche kattu, PK panche, katamarayudu rowdy movie, Pawan Kalyan Lungi Slippers

Katamarayudu Makers irritating with Panche and slipper pre look posters. Satires on social media compare with Mohan Babu's Rowdy poster.

కాటమరాయుడికి కలెక్షన్ కింగ్ తో లింకు

Posted: 12/30/2016 11:29 AM IST
Satires on pawan katamarayudu lungi posters

చెప్పులు, పంచె కట్టు ఇవే కాటమరాయుడిలో ఇవే హైలెట్ అంశాలా? ఇంకేం లేవా? అంటూ సెటైర్లు పడుతున్నప్పటికీ, జనవరి 1కి తన అసలైన సత్తా ఏంటో చూపిస్తా అంటున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. న్యూఇయర్ గిఫ్ట్ అంటూ వరుసగా పోస్టర్ల మీద పోస్టర్లు రిలీజ్ చేస్తుండటంతో చిర్రెత్తుకొచ్చే వాళ్లు అలా కామెంట్లు చేస్తున్నారన్నది ఇట్టే అర్థమైపోతుంది. అయితే టీజర్ తో మాత్రం మాంచి ట్రీట్ ఇస్తానంటున్నాడు నిర్మాత శరత్ మరార్.

ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కాటమరాయుడి లుక్ పై పంచ్ లు పడటం మొదలైంది. ఓ అట్టర్ ఫ్లాప్ సినిమాతో పోలిక పెడుతూ ఆనందించేస్తున్నారు కొందరు. చిత్ర విచిత్రమైన యాంగిల్స్ లో కెమెరాలను చూపించే వర్మ గతంలో రౌడీ సినిమాలో సేమ్ ఇలాంటి ఫీటే చేశాడు. పంచెకట్టులో ఉన్న డైలాగ్ కింగ్ మోహన్ బాబు ను ఫస్ట్ లుక్ లో వెనకాల నుంచి ఇలాగే చూపించాడు.

అంతే ఆ రెండు ఫోటోలను పక్కపక్కనే పెట్టి తెగవైరల్ చేసేస్తున్నారు. పైగా కథ కూడా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ ఉంటంతో కథ ఛేంజ్, మిగతాదంతా సేమ్ టూ సేమ్ అంటూ పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రీలుక్ పోస్టర్ల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పవన్ ఫ్యాన్స్ కి కలెక్షన్ కింగ్-కాటమరాయుడి పోస్టర్ మరింత చికాకు కలిగిస్తోందంట. ఏది ఏమైనా డిసెంబర్ 31 అర్థరాత్రి విడుదల కాబోయే టీజర్ ఏ మేర అలరిస్తుందో చూద్దాం.

Katamarayudu Mohan Babu

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Katamarayudu  Pawan Kalyan  Rowdy Movie  Panche posters  PK Fans  Irritate  

Other Articles