ఛాన్సులు ఇస్తే అఫైర్ అంటగట్టడమేనా? | Amala respond on affair with Dhanush.

Amala paul on affair with dhanush

Amala Paul, Amala Dhanush Affair, Amala Serious on Dhanush Affair, Amala Dhanush Relation, Amala Paul Divorce, Actress Amala Paul movies, Amala Paul God Father, Amala Paul alleged boy friend, Amala Paul Dhanush Movie, Dhanush convinced Vijay for Amala, Dhanush Amala best friends, South Actress Amala Paul

Amala Paul responded on Affair with Hero Dhanush.

కొత్త అఫైర్ గురించి అమలా ఏమంటోంది?

Posted: 12/26/2016 02:54 PM IST
Amala paul on affair with dhanush

విడాకుల తర్వాత అమలా పాల్ కెరీర్ అనుకున్న దానికన్నా మరింత జెట్ స్పీడ్ తో ఊపందుకుంది. భర్త దర్శకుడు, మామ నిర్మాత కావటంతో ఆమెకు అవకాశాలు దక్కటం కష్టమనుకున్న తరుణంలో ధనుష్ రూపంలో వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం 'వడా చెన్నై' .. ' వీఐపీ 2' సినిమాల్లో ఆమె హీరోయిన్. అయితే విడాకుల దగ్గరి నుంచి అమలాపాల్ కు సన్నిహితంగా ఉంటున్న ధనుష్, ఆమెకు గాడ్ పాధర్ గా మారిపోవటంపై రూమర్లు చెలరేగాయి. ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని, ఒకానోక దశలో విడాకులకు ధనుష్ కూడా కారణం అనే ప్రచారం జరిగింది.

అయితే వాటన్నింటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతోంది అమల. ధనుష్ తనకి జస్ట్ మంచి ఫ్రెండనీ, అఫైర్ ఉందంటూ ప్రచారం చేయడం సరికాదని అంటోంది. ఇంకొందరైతే రజనీకాంత్ మా వ్యవహారంతో అప్ సెట్ అయ్యాడని, ఐశ్వర్యతో ధనుష్ విడాకులు తీసుకోబోతున్నాడని నోటికొచ్చినట్లు రాశారు. అసలు తనను- మళ్లీ తన భర్తతో కలపటానికి ధనుష్ తీవ్రంగా యత్నించాడని కూడా తెలిపింది.

ఈ ప్రచారంలో నిజం లేదని ఇప్పటికే చాలామంది గ్రహించారనీ, ఇక తాను ఈ విషయాన్ని గురించి పట్టించుకోదలచుకోలేదని చెప్పుకొచ్చింది. మరోవైపు తాను నటిస్తున్న సినిమాలన్నీ ధనుష్ తోనే కావటంపై స్పందిస్తూ... మంచి స్నేహితుడు గనకే తన సినిమాల్లో అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడని పేర్కొంది. నిజానికి వడ చెన్నై సమంత తప్పుకున్నాక అమలాపాల్ కి ఛాన్స్ దొరకటం, ఆపై ఆమె నటించటం ఇష్టం లేకనే ఆమె భర్త, మామలు అభ్యంతరం చెప్పటం, అది కాస్త ముదిరి విడాకులకు దారి తీయటం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amala Paul  Dhanush  Affair  

Other Articles