రీల్ వర్సెస్ రియల్: దంగల్ లో ఆ ఫైట్ ను తప్పుగా చూపించారు | Geeta Phogat’s match wrong in Dangal.

Huge mistake in aamir khan dangal

Dangal Movie, Dangal collections, Dangal Geeta Phogat’s match, Geeta Phogat’s match in Dangal, Dangal Common Wealth match, Dangal Movie Mistakes, Aamir Khan film Dangal, Dangal big mistakes, Dangal wrongs, Geeta Phogat in Dangal, Reel versus Real fight

Aamir Khan film Dangal got this important detail of Geeta Phogat’s match wrong.

దంగల్ లో ఆ సీన్ ముమ్మాటికీ తప్పే

Posted: 12/26/2016 10:14 AM IST
Huge mistake in aamir khan dangal

పెద్ద నోట్ల రద్దు ఏ మాత్రం ప్రభావం చూపించకుండా అమీర్ ఖాన్ దంగల్ దూసుకుపోతుంది. తొలి రోజు 30 కోట్లు, ఆ తర్వాతి రెండు రోజులు అంతకు మించి కలెక్షన్లు రాబట్టిన ఈ బ్లాక్ బస్టర్ బయోపిక్ మున్ముందు మరిన్ని రికార్డు సృష్టించటం ఖాయమనే అనుకోవచ్చు. ఓ మల్లయోధుడి తపనను బయోపిక్ రూపంలో తెరకెక్కించటం అంటే మాములు విషయం కాదని దర్శకుడు నితిశ్ కుమార్, ఆ పాత్రకు తాను మాత్రమే వంద శాతం న్యాయం చేకూర్చగలనంటూ నటనతో అమీర్ చేసి చూపించారు.

అయితే ఈ క్రమంలో వాళ్లు స్వేచ్ఛను తీసుకోవటంపైనే క్రిటిక్స్ పెదవి విరుస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ఇన్సిపిరేషన్ బయోపిక్ లలో ఉన్నది ఉన్నట్లు కాస్త ఎమోషనల్ గా చూపిస్తేనే జనాలు కనెక్ట్ అవుతారు. మీడియా మూలంగా ముఖ్యంగా ప్రతీ విషయం తెలిసిపోతున్న ఈ రోజుల్లో కల్పితానికి ఆస్కారం లేకుండానే తీయటమే మంచిది. బాగ్ మిల్కా బాగ్, ధోనీ విషయంలో ఇలాగే జరిగింది కూడా.

కానీ, దంగల్ విషయానికొస్తే... ఇందులో ఓ సీన్ ను తప్పుగా చిత్రీకరించటం గురించి చర్చ మొదలైంది. సినిమాలో మహావీర్(అమీర్ ఖాన్) కూతురు గీతా పాత్రలో ఫాతిమా సనా నటించింది. కామన్ వెల్త్ గేమ్స్ లో ప్రత్యర్థితో పోటాపోటీ పడి పతాకం సాధించే సీన్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అయితే నిజానికి జరిగింది మరోలా ఉంది. 2010 ఢిల్లీలో జరిగిన కామన్ వెల్త్ పోటీల్లో గీతా పోగట్ 1-0, 7-0 తేడాతో ప్రత్యర్థిని మట్టి కరిపించి స్వర్ణం గెలిచింది. అయితే ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్ ను సినిమాలో మాత్రం చాలా డ్రామాటిక్ గా 3-0, 4-6, 6-5 తో గెలిచినట్లు చూపించారు.

 

మాములు సన్నివేశాలలో అయితే ఏదో అనుకోవచ్చు గానీ, ఇలా అందరికీ తెలిసిన విషయాన్ని ఇలా తీయటంపై విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాన్ని పరిశీలించకుండానే గుడ్డిగా తెరకెక్కించారా? లేక కావాలనే స్వేచ్ఛ తీసుకున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదీ ఏమైతేనేం.. సినిమాలో ఆ సీన్ బాగానే  పేలింది. దంగల్ హవా బాక్సాపీస్ ను షేక్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dangal Movie  Geeta Phogat  Common Wealth Fight  Wrong  

Other Articles