ఆర్జీవీ పవన్ ను పొగిడాడా? | RGV praised Pawan Kalyan's fire.

Rgv praised pawan in twitter

Director Ram Gopal Varma, Pawan kalyan, Pawan RGV, Varma Pawan Kalyan, RGV twitter, Varma twitter, RGV pawan Kalyan tweets, varma positive tweets on Pawan, Pawan kalyan Gam Gopal varma, Ram gopal varma pawan kalyan, pawan kalyan tweets, Varma Pawan Kalyan Volcano, Varma again praise Pawan Kalyan

Ram Gopal varma compared Pawan kalyan with a Volcano.

పవన్ ఓ అగ్ని పర్వతం లాంటోడు-వర్మ

Posted: 12/23/2016 08:51 AM IST
Rgv praised pawan in twitter

అర్థరాత్రి వర్మ చేసే ట్వీట్లు చాలా స్పైసీ స్పైసీగా ఉంటుంటాయి. అదే సమయంలో మెగా ఫ్యామిలీని పొగిడినట్లే పొగుడుతూ చురకలు అంటించటం వర్మకు ఓ వ్యాపకంగా మారిపోయింది. పవన్ ఫ్యాన్స్ తో పెట్టుకోవటం దగ్గరి నుంచి చిరు 150 సినిమాపై దాకా అంతా అడ్డగోలు ట్వీట్లు చేసి తిట్లు తింటున్నాడు. అయితే పంథా మారని వర్మ మరోసారి పవన్ ను టార్గెట్ చేసి ట్వీట్ పెట్టాడు.

‘‘పవన్ నిద్ర పోతున్న ఓ అగ్నిపర్వతంలాంటోడు. అప్పుడప్పుడు గుడగుడలాడుతూ పొగ వదులుతుంటాడు. టైం వచ్చినప్పుడే పేలతాడు అంటూ ఓ ట్వీట్ వేశాడు. అంతేకాదు వంగవీటి సందర్భంగా ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ప్రస్తుత రాజకీయ పరిణామాలను పవన్ నిశితంగా గమనిస్తున్నారని... వచ్చే ఎన్నికల్లో దుమ్మురేపుతారని, పవన్ కు ఆ దమ్ము ఉందని తెలిపాడు.

మరి ఈ లెక్కన వర్మ పవన్ ని పొగిడినట్లే కదా! అయితే అవకాశం వచ్చినప్పుడల్లా పవన్ కల్యాణ్ పై ట్విట్టర్లో ఇండైరెక్ట్ గా సెటైర్లేసే వర్మ ఈసారి రూటు మార్చటం మాత్రం కాస్త అనుమానంగానే ఉంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma Twitter  Praise  Pawan Kalyan  

Other Articles