సూపర్ స్టార్ ను పూర్తిగా డామినేట్ చేసిన లైలా | Sunny Leone dominates SRK in Lalila song.

Raees laila main laila official song released

Sunny Leone, Sunny Leone Item Song, Sunny Leone Laila Main Laila, Laila Main Laila song, Laila Main Laila remix, Laila Main Laila Raees, Laila Main Laila video song, Laila Main Laila Sharukh Khan, Laila Main Laila Sunny dominates, Laila Main Laila new song, Laila Main Laila 2017, Laila Main Laila sunny leone, Sunny Leone Youtube record

Sunny Leone sizzles in Laila Main Laila from Raees.

లైలాగా సన్నీ మరో సంచలనం

Posted: 12/22/2016 10:34 AM IST
Raees laila main laila official song released

ఈ రోజుల్లో రీమిక్స్ పాటలంటే ముందుగా ఒరిజినాలిటీని చెడగొట్టేస్తున్నారన్న అభిప్రాయం ప్రేక్షకులలో బలంగా ఫిక్సయ్యింది. దానికి కారణం అవసరం లేకపోయిన కొందరు వారసులు బలవంతంగా తమ సినిమాల్లో ఇరికించుకోవటమే. అయితే బాలీవుడ్ లో మాత్రం ఈ విషయంలో కాస్త పరిస్థితి మెరుగ్గానే ఉంది. రిచ్ లుక్, లావిష్ సెట్ లతో పాత పాటకు ఏ మాత్రం తగ్గకుండా రీమిక్స్ లను కానిచ్చేస్తున్నారు. ఇక ఇప్పుడు చెప్పుకోవాల్సింది బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ రాయిస్ లోని పాట గురించి...

కుర్బానీ సినిమాలో జీనత్ అమాన్ వేసిన లైలా మై లైలా పాట ఎంత సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. కళ్యాణ్ జీ-ఆనంద్ జీ అందించిన ట్యూన్ అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. ఇక ఇప్పుడు రాయిస్ కోసం ఏకంగా సన్నీలియోన్ తోనే రీమిక్స్ చేయించి పడేశాడు షారూఖ్. లేటెస్ట్ గా ఈ పాట వీడియో రిలీజ్ చేశారు. రామ్ సంపత్ సంగీతం, పావనీ పాండే పాడిన ఈ పాటకు బాస్కో సెజర్ నృత్యాలు సమకూర్చాడు. ఇక పాటలో సన్నీ రెచ్చిపోయి డాన్సులు కట్టింది.

 

భారీగా స్టెప్పులు లేకపోయినప్పటికీ దేశీవాళీ హాట్ షోతో సన్నీ చెలరేగిపోయింది. ఇక పాటలో షారూఖ్ జస్ట్ అప్పీరియన్స్ మాత్రమే ఉండటం, సన్నీ వన్ ఉమెన్ షోగా ఉంది. చివర్లో సన్నీ షారూఖ్ ని వాటేసుకుంటూ అలా అలా రొమాంటిక్ గా సాగిపోయిందీ పాట. అఫీషియల్ సాంగ్ రిలీజ్ చేసిన జస్ట్ 24 గంటలు కాకముందే 5 మిలియన్ల వ్యూవ్స్ వచ్చాయంటే బాద్ షా క్రేజ్ తోపాటు సన్నీ కూడా కారణం అన్నది ఒప్పుకోవాల్సిందే. గ్యాంగ్ స్టర్ అబ్దుల్ లతీఫ్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంలో గుజరాత్ లిక్కర్ డాన్ గా షారూఖ్ కనిపించబోతున్నాడు. వచ్చే నెలలో రాయిస్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Laila Main Laila remix  Raees song released  

Other Articles