మ్యూజికే కాదు.. గ్రాఫిక్స్ వర్క్ కూడా కాపీయేనా? | Satakarni Tunes not Copied From Bajirao Mastani.

No connection between satakarni and bajirao mastani

Krish Gautamiputra Satakarni, Gautamiputra Satakarni Tunes Bajirao Mastani, Satakarni graphics Bajirao Mastani, Gautamiputra Satakarni Tunes, Satakarni tunes visual effects, Bajirao Mastani GSP, GSP Sanjayleela bansali, Satakarni rumours, Balayya Bajirao Mastani, NBK100

Krish denied rumours on Gautamiputra Satakarni Tunes and Visual effects Coped From Bajirao Mastani.

శాతకర్ణి-బాజీరావ్ మస్తానీ ఓ క్లారిటీ

Posted: 12/21/2016 02:52 PM IST
No connection between satakarni and bajirao mastani

ఓవైపు అగ్రహీరోల చిత్రాల షూటింగ్ లు జరుగుతుంటే.. ఇంకోవైపు వాటికి సంబంధించి అడ్డగోలు గాసిప్స్ చక్కర్లు కొట్టడం చూస్తున్నాం. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాలయ్య వందో చిత్రం శాతకర్ణి విషయంలోనూ ఇప్పుడు అదే జరుగుతోంది. ఓ బాలీవుడ్ సినిమా నుంచి ట్యూన్స్, గ్రాఫిక్స్ వర్క్ కాపీ చేశారన్నది దాని సారాంశం.

గతేడాది బాలీవుడ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కి బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం బాజీరావ్ మస్తానీ. శాతకర్ణి ట్రైలర్ రిలీజ్ అయ్యాక బ్యాగ్రౌండ్ స్కోర్ ను, కొన్ని విజువల్ వర్క్స్ క్రిష్ కాపీ కొట్టాడని రెండు రోజులుగా వార్తలు వెలువడ్డాయి. అయితే గతంలో సంజయ్ లీలా బన్సాలీ గబ్బర్ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించాడు. ఈ క్రమంలో పర్మిషన్ తీసుకునే క్రిష్ వాటిని వాడుకున్నాడంటూ ఇంకో వార్త వెలువడింది.

దీంతో రంగంలోకి దిగిన క్రిష్ ఓ ప్రకటన చేశాడు. అదంతా ఉత్తదేనని, శాతకర్ణి కోసమే ప్రత్యేకంగా గ్రాఫిక్స్ వర్క్ చేయించామని తెలిపాడు. కాపీ చేశామన్న వార్తలు వట్టి పుకార్లని చెప్పిన క్రిష్, తక్కువ టైంలోనే సినిమా తెరకెక్కటం మూలంగానే శాతకర్ణి విషయంలో ఇలాంటి వార్తలు పుట్టుకొస్తున్నాయని పేర్కొన్నాడు. అంతర్జాతీయ ప్రమాణాలున్న విజువల్ ఎఫెక్ట్స్, అందుకు తగ్గట్లే చిత్తరంజన్ భట్ సంగీతం గ్రాండ్ గా ఉంటుందని వివరించాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Director Krish  Gautamiputra Satakarni  Tunes and visual effects  Bajirao Mastani.  

Other Articles