అట్టర్ ఫ్లాప్ రచయితతో మహేష్ సినిమానా? | Srihari Nanu story for Mahesh-Koratala New Film.

New story for mahesh koratala new movie

Koratala Sica, Mahesh babu, Koratala Mahesh Babu, Koratala New Story for Mahesh, hari nanu, Hari Nanu Mahesh Babu, Utter Flop Director Story for Mahesh, Mahesh Koratala new writer, Mahesh Babu new film, Mahesh Babu political story

Koratala pick new story for Mahesh Babu Movie. Director Hari Nanu Story for Mahesh's Next.

మహేష్ కోసం మళ్లీ కొత్త కథనా?

Posted: 12/10/2016 12:51 PM IST
New story for mahesh koratala new movie

టాలీవుడ్ లో రచయితలే ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకుని డైరక్షన్ డిపార్ట్ మెంట్ లోకి దిగిపోతున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్, కొరటాల లాంటి వాళ్లు పీక్స్ లో నిల్చుంటే, మరికొందరు యువ రచయితలు కూడా ఆ ఘనత సాధించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టి సక్సెస్ అవుతున్నారు కూడా. ఇండస్ట్రీకి వచ్చి పవర్ ఫుల్ కథలను అందించిన కొరటాల ప్రస్తుతం తన సొంత కథలు, స్క్రీన్ ప్లే తోనే సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. రాజమౌళి తర్వాత హాట్ దర్శకుడిగా మారిపోయిన కొరటాల నెక్స్ట్ మళ్లీ మహేష్ తోనే చేయబోతున్నాడన్నది తెలిసిందే.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి తర్వాత షూటింగ్ మొదలుపెట్టుకోబోతుంది. అయితే ఇంతలో ఏం జరిగిందో తెలీదుగానీ, ఈ చిత్రం కోసం కొరటాల బయటి కథను తీసుకోబోతున్నాడన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. స్వతహాగా రచయిత అయిన కొరటాల శివ, ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలకు కథా కథనాలను తనే రాసుకున్నాడు. అయితే మహేష్తో చేయబోయే కొత్త సినిమాకు మాత్రం మరో దర్శకుడి నుంచి కథను తీసుకున్నాడట.

నటి భూమికకు సన్నిహితుడు, ఇంతకు ముందు తకిట తకిట, సత్యభామ చిత్రాల దర్శకుడు అయిన శ్రీహరి నాను అనే దర్శకుడు ఒకాయన ఉన్నాడు. మహేష్ బాబు కోసం ఓ పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాను అతనితో సిద్ధం చేయించాడని తెలుస్తోంది. శ్రీహరి చెప్పిన లైన్ నచ్చిన కొరటాల, ప్రస్తుతం ఆ కథను పూర్తి స్క్రిప్ట్గా రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కబోయే సినిమాకు 'భరత్ అను నేను' అనే టైటిల్, సీఎం అనే టైటిల్ పరిశీలనలో ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Koratala new movie  hari nanu story  

Other Articles