సచిన్ బిజినెస్ పార్ట్ నర్ గా బన్నీ | Bunny co partner in Bengaluru Blasters.

Allu arjun selfie with sachin

Allu Arjun Sachin, Sachin with Allu Arjun, Bunny Brand ambassador, Allu Arjun Bengaluru Blasters, Bunny badminton team, badminton team Sachin Bunny, Allu Arjun Badminton team, Bunny Co-owner Bengaluru Blasters, Bengaluru Blasters Allu Arjun, Allu Arjun Sachin Nimmagadda, Sachin Tendulkar Allu Arjun

Allu Arjun Co-owner along with Sachin and Gopichand for Bengaluru Blasters badminton team.

బన్నీతో సచిన్ ఎక్కడ కలిశారబ్బా?

Posted: 12/08/2016 04:24 PM IST
Allu arjun selfie with sachin

ప్రస్తుతం కోట్లకు కోట్లు రెమ్యునరేషన్లు తీసుకుంటున్న ఈ జనరేషన్ హీరోలు తమ సొమ్మంతా బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. నితిన్ రెస్టారెంట్ ఫీల్ట్ లోకి ఎంటర్ అయితే, రాంచరణ్ ఏకంగా ట్రూ జెట్ పేరుతో ఎయిర్ లైన్స్ ను నడిపించేస్తున్నాడు. ఇక తండ్రి, టాప్ ప్రొడ్యూసర్ నిర్మాత అల్లు అరవింద్ వ్యాపార రంగంలో ఇప్పటికే తోపు. మరి అలాంటిది అల్లు అర్జున్ ఊరుకుంటాడా?

ఏకంగా ఓ బ్యాడ్మింటన్ టీంలో పార్టనర్ గా మారిపోయాడు. బెంగళూరు బ్లాస్ట్స్ పేరుతో ఉన్న ఓ జట్టులో ఇప్పటికే నిమ్మగడ్డ, సచిన్ లు పార్టనర్ లు కాగా, ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అందులో భాగస్వామిగా మారిపోయాడు. కాసేపటి క్రితం తన ట్విట్టర్ అకౌంట్ లో నా బెస్ట్ సెల్ఫీలలో ఇది ఒకటి అంటూ ట్వీట్ చేశాడు.

 

బెంగళూరు బ్లాస్టర్స్ టీంకు సహ భాగస్వామిగా వ్యవహారించటం గొప్ప గౌరవంగా భావిస్తున్నా అంటూ ఓ సందేశం ఉంచాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తోపాటు, చాముండేశ్వరీ, నిమ్మగడ్డ ప్రసాద్, బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ ఇందులో ఉన్నారు. ఈ టీంకు బన్నీ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించనున్నాడు.

ఇక మొన్నామధ్యన ఇద్దరు పార్ట్ నర్లతో కలిసి ఒక బ్రూయింగ్ క్లబ్ కూడా ఓపెన్ చేశాడు బన్నీ. ఓ స్టార్ హీరో ఇలా హై-ఫై బార్ ను ఓపెన్ చేయడం పెద్ద డిస్కషన్ కే తెరలేపింది. అన్నట్లు అల్లు అరవింద్, చిరంజీవి అండ్ నాగ్ లతో కలసి కేరళ ఫుట్ బాల్ క్లబ్ టీమ్ ను కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బన్నీనేమో బ్యాడ్మింట్మన్ పై మక్కువతో.. ఇలా ఓ టీంలో పార్ట్ నర్ అయిపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sachin Tendulkar  Allu Arjun  Badminton TEam  Bengaluru Blasters  

Other Articles