అమ్మ బయోపిక్ ఎప్పుడో తీసేశారు! | Did you know that Aishwarya Rai had played Jayalalithaa in Mani Ratnam's Iruvar.

Iruvar movie on jayalalithaa s early life

Aishwarya Rai Bachchan Jayalalithaa, Amma Aish, Aish in Amma's Role, maniratnam Iruvar Jayalalitha, Iruvar Jayalalithaa, Jayalalithaa role in Iruvar, Iruvar Jayalalithaa, Iruvar rewind

When Aishwarya Rai Bachchan portrayed Jayalalithaa in a movie and she died.

అమ్మ పాత్రలో ఐష్ గుర్తుందా?

Posted: 12/07/2016 04:48 PM IST
Iruvar movie on jayalalithaa s early life

అలనాటి అందాల నటి, కళామైమని జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు ఈ మధ్య డస్కీబ్యూటీ త్రిష్ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే అరవ సంచలనం అయిన అమ్మ జీవిత గాథలో కొంత పార్ట్ ను ఎనాడో చూపించేశాడన్న విషయం బహుశా చాలా కొద్దిమందికి తెలిసి ఉంటుంది. అది ఎవరో కాదు క్లాసిక్ దర్శకుడు మణి రత్నం. అవును...తమిళ రాజకీయాలను వెండితెరపై ఆవిష్కరిస్తూ మణి తెరకెక్కించిన ఇరువర్(తెలుగు లో ఇద్దరు) సినిమానే అది. అందులో జయ పాత్రను అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ పోషించింది.

ఎంజీఆర్ పాత్రలో కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, జయలలిత పాత్రలో ఐష్, ఇక కరుణానిధి పాత్రలో ప్రకాశ్ రాజ్ ఇందులో నటించారు. ఐష్, ప్రకాశ్ రాజ్ లు ఇద్దరికీ ఇది డెబ్యూ మూవీనే కావటం విశేషం. ఇక స్నేహితులుగా ఉన్న ఎంజీఆర్, కరుణానిధిలు శత్రువులుగా ఎలా మారారు? కలం స్నేహం కాస్త కలహా స్నేహంగా ఎలా మారింది? మధ్యలో జయ పోషించిన పాత్ర ఇలా.. ప్రతీ అంశాన్ని వివాదాస్పదం కాకుండా అద్భుతంగా తెరకెక్కించాడు మణి.

అయితే ఇందులో పాత్రల కోసం ముందుగా అనుకున్నది ఒకరిని అయితే చేయించింది మరోకరితోనంట. ఎంజీఆర్ కు మొదటి నుంచి మోహన్ లాల్ నే తీసేసుకున్న దర్శకుడు, కరుణానిధి క్యారెక్టర్ కోసం మాత్రం బాలీవుడ్ నటుడు నానాపటేకర్ ను అనుకున్నాడంట. ఆపై మమ్ముటి, కమల్, సత్యరాజ్, మిథున్ చక్రవర్తి, శరత్ కుమార్ ఇలా తిరిగి తిరిగి ప్రకాశ్ రాజ్ కు దక్కింది. మరోవైపు ఐష్ పాత్ర కోసం ముందు టబును, గౌతమీని కూడా సంప్రదించి వారు ఒప్పుకోకపోవటంతోనే ఐష్ తో కానిచ్చేశాడు.

మొత్తానికి ఇలాంటి కాంబోతో తెరకెక్కిన ఈ చిత్రం కంటెంట్ పరంగానే కాదు, రెహ్మన్ అందించిన మ్యూజిక్ ను కూడగల్పుకుని అద్భుత విజయాన్ని సాధించింది. తొలి చిత్రంతోనే ప్రకాశ్ రాజ్ ఉత్తమ సపోర్టింగ్ పాత్రకు నేషనల్ అవార్డు అందుకోగా, జయగా ఐష్ అభినయానికి మార్కులు వేయటంతోపాటు ఆపై హీరోయిన్ గా స్థిరపడిపోయేందుకు ముద్రవేసింది. అయితే ఆమె రాజకీయ ప్రస్థానాన్ని ఇందులో పూర్తిగా అప్పటికే చూపించే అవకాశం లేకపోవటంతో త్రిష ఆ ధైర్యం చేయవచ్చనే అనుకోవచ్చు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aishwarya in Jayalalithaa role  Iruvar movie  

Other Articles