ప్రతీ నెలా గర్భవతిని చేశారు.. భర్తతో గొడవలు లేవు | Media Make her Pregnant Every Month

Vidya balan condemns divorce rumours

Vidya balan, Vidya balan divorce rumour, Vidya balan Husband, Siddharth Roy Kapur, Vidya balan Siddharth Roy Kapur, Vidya balan Pregnant, Vidya balan Media, Vidya balan rumours, Vidya Balan Marital life

Vidya balan says nothing wrong in her marriage life. Fire on media Condemns Divorce rumour.

విడాకులపై స్పందించిన విద్యాబాలన్

Posted: 12/07/2016 10:58 AM IST
Vidya balan condemns divorce rumours

మైండ్ లో ఏదైతే ఉందో దాన్నే ముక్కుసూటిగా చెప్పేయటం డర్టీ బ్యూటీ విద్యాబాలన్ కు మొదటి నుంచి ఉన్న అలవాటే. ఈ క్రమంలో ఆమె చాలా విమర్శలే ఎదుర్కోంది. నాలుగేళ్ల క్రితం సిద్ధార్థ్ రాయ్ కపూర్ ను పెళ్లి చేసుకున్నాక భర్తతో ఆమె బయట కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. ఈ మధ్య అయితే మచ్చుకైనా భర్త పేరు బయటికి తీయటం లేదు. దీంతో వారిద్దరికి చెడిందన్న వార్తలు గుప్పుమన్నాయి.  

భర్తతో విడాకులకు సిద్ధమైపోయిందని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక వార్తలు రాయటంతో, దానిని ఫాలో అవుతూ మిగతా మీడియా కూడా కథనాలు అల్లేవాయి. అయితే భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ తో తనకు విభేదాలు తలెత్తాయంటూ వస్తున్న వార్తలు జస్ట్ రూమర్లంటూ కొట్టిపడేసింది.

అవన్నీ అవాస్తవాలు, ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తెలీదంటూ చెప్పింది. గతంలో కూడా తన ప్రెగ్నెన్సీపై పలు కథనాలు వెలువడ్డాయని... తనను ప్రతినెలా గర్భవతిని చేశారని మండిపడింది. మొదట్లో ఇలాంటి రూమర్ల పట్ల కొంచెం బాధ పడేదాన్నని... ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశానని విద్య చెప్పింది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vidya balan  Siddharth Roy Kapur  Divorce Rumour  

Other Articles