అల్లు అరవింద్ సోదరి కన్నుమూత | Allu Aravind’s Elder Sister Passed Away.

Allu aravind s sister passed away

Allu Aravind, Allu Aravind's sister, Allu Aravind’s Elder Sister Bharati, Allu Bharati death, Allu Aravind Sisters, Allu Aravind’s Elder Sister Bharati Died

Allu Aravind’s Elder Sister Bharati Passed Away.

అల్లు అరవింద్ సోదరి మృతి

Posted: 12/05/2016 04:31 PM IST
Allu aravind s sister passed away

టాలీవుడ్ అగ్రనిర్మాత అల్లు అరవింద్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన అగ్ర సోదరి అల్లు భారతి సోమవారం ఉదయం మృతి చెందారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మృతితో అల్లు, మెగా ఫ్యామిలీలు షాక్ కి గురయ్యాయి.

అలనాటి మేటి హాస్య నటుడు అల్లు రామలింగయ్య పెద్ద కుమార్తె అల్లు భారతి. 74 ఏళ్ల నవ భారతి అవివాహిత. ప్రస్తుతం ఆమె అరవింద్ ఇంట్లోనే ఉంటున్నారు. గత సాయంత్రం ఆమె ఆరోగ్యం క్షీణించగా.. ఈరోజు ఉదయం మరణించినట్లు తెలుస్తోంది. కోకాపేటలోని ఫాం హౌజ్ వద్ద ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకు ముందు ఆమె తండ్రి అల్లు రామలింగయ్య అంత్యక్రియలు కూడా అక్కడే నిర్వహించారు.

ఇక ''ధృవ'' సినిమా తాలూకు ప్రమోషన్లు చేయాల్సి ఉండటంతో.. రామ్ చరణ్ వాటన్నింటినీ రద్దు చేసి.. తన పెద్దమ్మ అంతిమ సంస్కారాలకు సంబంధించి ఏర్పాట్లు చూస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్ధిస్తూ తెలుగు విశేష్ తరపున అల్లువారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Aravind Sister  Allu Bharati death  

Other Articles