శాతకర్ణి కంటే ఖైదీ ఎందుకు లేట్ అయ్యాడంటే... | Khaidi confirms entering Last Phase.

Khaidi no 150 delay due to song

Ram Charan, Khaidi No 150, Megastar Chiranjeevi 150, Khaidi No 150, Chiru Khaidi 150, Chiru 150 Pumpkin, Chiru 150 shoot wrap up, Chiru Charan 150, Ram Charan about Chiru 150, Chiru 150 Khaidi No 150, Khaidi No.150 Last Schedule, Ram Charan Konidela Production,

Khaidi No.150 movie entering into last phase producer Ram Charan Confirmed.

శాతకర్ణి కంటే ఖైదీ ఎందుకు లేట్ అంటే..

Posted: 12/03/2016 11:29 AM IST
Khaidi no 150 delay due to song

సంక్రాంతి బరిలో పెద్ద పెద్ద సినిమాలు పోరుకు రెడీ అయిపోతున్నాయి. ఓ పక్క బాలయ్య శాతకర్ణి, మరోపక్క యువ హీరో శర్వానంద్ శతమానం భవతి రెండూ గుమ్మడి కాయలు కొట్టేశాయి. అయితే అంచనాలు ఎక్కువగా ఉన్న చిరు 150వ చిత్రం గురించి ఇంకా ఏంటో క్లారిటీ లేకుండా పోయింది. అల్రెడీ మెజార్టీ షూటింగ్ (85 శాతం పైగానే )అయిపోయిందని నెల రోజుల నుంచి చిత్ర యూనిట్ చెప్పుకోచ్చింది. పాటలు కూడా అల్రెడీ చిత్రీకరించేశారు మరి ఇంకెందుకు ఆలస్యం.?

తాజాగా దీనిపై చిత్ర నిర్మాత రాంచరణ్ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం చివరి షెడ్యూల్, అది కూడా లాస్ట్ ఫేస్ లోనే ఉన్నట్లు చెప్పేశాడు. అంతేకాదు అనుకున్న టైం ప్రకారం ఆడియో, రిలీజ్ డేట్లు ఉండబోతున్నాయని, ట్రైలర్ విషయంలో కూడా రెండు, మూడు రోజుల్లో ఓ ప్రకటన చేస్తామని తెలిపాడు. ఇదిలా ఉంటే ఒక్క పాట మాత్రమే బ్యాలెన్స్ ఉందని, అందులో చిరు, కాజల్ తోపాటు చెర్రీ కూడా చిందులేస్తాడని చెబుతున్నారు.

మరోవైపు ఖైదీ నంబర్ 150కి సంబంధించిన రెండు స్టిల్స్ ను కూడా చెర్రీ తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టాడు. దర్శకుడు వినాయక్ ఏదో సన్నివేశాన్ని చిరు, కాజల్, అలీకు వివరిస్తున్నట్లు ఒకటి, మరోకటి ఏమో చిరు కొంటెగా తొంగి చూస్తున్నట్లు ఉన్నాయి. మొత్తానికి సంక్రాంతికి మెగా సందడి అన్నది ఈ ఒక్క వార్తతో ఫిక్సయిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khaidi No 150  Last Schedule  Producer Ram Charan  Release date  

Other Articles

Today on Telugu Wishesh