బాలీవుడ్ తరహాలో శాతకర్ణి వెరైటీ ప్రమోషన్ | Satakarni follows bollywood style.

Variety promotion for balayya

balakrishna, Gautamiputra Satakarni, Satakarni promotions, GSP promotions, balayya Twitter, Satakarni Photo Shoot, Satakarni follows bollywood style, Balayya 100 movie promotion, Bala Krishna Photo Shoot, Balayya Satakarni Photo Shoot, Balayya GSP photoshoot, Shriya GSp photo shoot, Hema Malini Photo Shoot

New Style promotion for Balayya's Satakarni with Special Photo Shoot.

శాతకర్ణి ప్రమోషన్ కోసం ఫస్ట్ టైం

Posted: 12/01/2016 01:16 PM IST
Variety promotion for balayya

ప్రతిష్టాత్మక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి అంకం చివరి దశకు చేరుకుంది. సుమారు మూడు నెలలపాటు నాన్ స్టాప్ గా జరిగిన ఈ చిత్ర షూటింగ్ నేటితో పూర్తి కానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆఖరి రోజు షూట్ పూర్తయ్యాక గుమ్మడికాయ కొట్టేందుకు క్రిష్ అండ్ టీం సిద్ధమైపోయింది. బాలయ్య కెరీర్ లో మైలు రాయి లాంటి ఈ వందో చిత్రాన్ని గ్రాండ్ గా తెరకెక్కించటమే కాదు. అందుకు తగ్గట్లుగానే ప్రమోట్ చేసేందుకు నిర్మాతలు ఫ్లాన్ లు చేసుకుంటున్నారు.

అందుకే అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలకూడదని డిసైడ్ అయిన క్రిష్ బాలయ్య ను ఒప్పించి త్వరలో ట్విట్టర్ లోకి తీసుకురాబోతున్నాడు. అంతేకాదు ఫస్ట్ టైం టాలీవుడ్ లో ఓ విభిన్న ప్రయత్నం చేయబోతున్నాడు. బాలయ్యతోపాటు, రాజమాత హేమా మాలిని, హీరోయిన్ శ్రీయా శరణ్ లతో ఓ స్పెషల్ ఫోటో షూట్ చేయించబోతున్నాడు. సినిమాలోని పాత్రలతోనే ఇది ఉండబోతుందని తెలుస్తోంది. ఈ ఫోటోషూట్ ను ప్రమోషన్ లో భాగంగానే రిలీజ్ చేయబోతున్నాడు.

మూడు ఫారిన్ షెడ్యూల్స్, ఒక నార్త్ ఇండియన్, రామోజీ ఫిల్మ్ సిటీలో లాంగ్ పార్ట్ తోనే మొత్తం 80 రోజుల్లోనే క్రిష్ ఈ సినిమాను పూర్తి చేయటం,  పైగా నాలుగు వార్ సీన్ లతో రెండున్నర గంటల్లో సినిమాను పూర్తి చేయటం విశేషం. అందుకేనేమో బాలయ్య మెచ్చి తన కొడుకు డెబ్యూని క్రిష్ చేతిలో పెడుతున్నాడన్న వార్తలు వినిపిస్ోతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  GSP  100 Movie  Promotions  

Other Articles