బేతాళుడిపై విజయ్ ది ఓవర్ కాన్ఫిడెన్సా? | Vijay Anthony's Bethaludu doing shocking business

Vijyay anthony full confident on bethaludu

Bethaludu, Vijay Anthony, Vijay Bethaludu, Vijay Anthony new movie, Vijay saitan telugu business, Bethaludu Tollywood, Bethaludu business, Bethaludu videos, Bethaludu huge release, Bethaludu theaters

Vijay Anthomy's Saitan(Bethaludu) ready for release. Doing Huge Business in telugu too.

బేతాళుడి వేట ఎలా ఉండబోతుంది?

Posted: 11/30/2016 12:47 PM IST
Vijyay anthony full confident on bethaludu

టాలీవుడ్ లో ఒక్క సినిమాతో సెన్సేషన్ గా మారిపోయిన విజయ్ ఆంటోనీకి విక్రమ్, సూర్య, కార్తీ లాంటి స్టార్ హీరోలకు రావాల్సిన క్రేజ్ అప్పుడే వచ్చేసింది. బిచ్చగాడుగా ఇచ్చిన షాక్ నుంచి తేరుకునేలోపే బేతాళుడిని కూడా దించేస్తున్నాడు. పెట్టుబడులను నిర్మాతకు అందించిన ఈ సైలెంట్ హీరో మార్కెట్ ఎలా చేసుకోవాలో కూడా నేర్చేసుకున్నాడు.

ప్రమోషన్ లో భాగంగా అల్రెడీ 10 నిమిషాల నిడివి ఉన్న సినిమాను(తమిళ్ వర్షన్ మాత్రమే) రిలీజ్ కు ముందే పెట్టేశాడు. హంట్ ఫర్ విజయలక్ష్మి అంటూ చేసిన ఆ ప్రయోగానికి మంచి స్పందన రావటంతో ఇప్పడు మరో వీడియోను పెట్టేశాడు. సైతాన్(బేతాళుడు) వేట మొదలైంది అంటూ... మరో నాలుగున్నర నిమిషాల వీడియోను పోస్ట్ చేశాడు. కారులో ఓ ఆడియోను వింటూ ఇంటికి వెళ్లిన విజయ్ కి, భార్యతో రొమాన్స్ చేసే సమయంలో ఓ సర్ ప్రైజ్ షాక్ తగిలే ముగింపుతో ఆ వీడియో ఉంది.

సినిమా రేపే విడుదల అవుతుండగా, ఈ సమయంలో కూడా ఇలా వీడియో పెట్టాడంటే విజయ్ ఎంత ధీమాతో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ‘బిచ్చగాడు’తో తెలుగులో తిరుగులేని స్టార్‌డమ్ తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ సినిమా కావడంతో బేతాళుడుకి క్రేజ్ పెరిగింది. ఎంతలా అంటే భారీ బిజినెస్ చేయటమే కాదు,  ఏకంగా 500 థియేటర్లలో బేతాళుడు రిలీజ్ కాబోతుంది. ప్రదీప్ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్మించాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Anthony  Bethaludu movie  telugu business  

Other Articles