ఆ తేదీనే ఫస్ట్ లుక్.. అమ్మో అంటున్న మహేష్ ఫ్యాన్స్.. ఎందుకు? Mahesh fans fear with new year sentiment.

Mahesh murugadoss movie title still no clarity

Mahesh Babu, AR Murugadoss, Mahesh murugadoss title, Mahesh New Year Sentiment, mahesh fans new year, Mahesh Babu Ahmedabad, Mahesh new movie title

Mahesh Murugadoss movie in third schedule at Ahmedabad. First look may release on New Year.

మహేష్-మురగదాస్ టెన్షన్.. టెన్షన్

Posted: 11/29/2016 11:26 AM IST
Mahesh murugadoss movie title still no clarity

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అన్ టైటిల్ సినిమా జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. కొద్ది రోజులు ఫ్యామిలీకి కేటాయించి, ఆపై తిరిగి షూటింగ్ లో మహేష్ జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లో యాక్షన్ మోడ్ లో ప్రిన్స్ ఉన్నాడు. ప్రస్తుతం జరిగే మూడో షెడ్యూల్ లో క్రిస్మస్ దాకా ఏకదాటిగా సాగుతుంది. ఆపై మళ్లీ ఫ్యామిలీతో న్యూఇయర్ వెకేషన్ కి మహేష్ ఫారిన్ వెళ్లిపోతాడు.

షూటింగ్ ప్రారంభం రోజే టైటిల్ అనౌన్స్ చేస్తున్న ఈ రోజుల్లో  దర్శకుడు మురుగదాస్ మాత్రం మూడు షెడ్యూలు నడిచినప్పటికీ ఇప్పటిదాకా ఎలాంటి అనౌన్స్ మెంట్ చేయకపోవటం విశేషం. తమిళ్ లో టాక్స్ తప్పాలంటే ఇంగ్లీష్ టైటిల్ ఉండకూడదు, మన దగ్గర మాత్రం మహేష్ క్రేజ్ కు తగ్గకుండా టైటిల్ పవర్ ఫుల్ గా ఉండాలనుకుంటున్నారు. ఈ క్రమంలో టైటిల్ పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

ఇక మరోవైపు దసరా, దీపావళి ఇలా ఫస్ట్ లుక్ ను పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతున్న చిత్ర యూనిట్ నుంచి ఇప్పుడు న్యూ ఇయర్ అంటూ మరో తేదీ వినిపిస్తోంది. మరోపక్క సూపర్ స్టార్  అభిమానులు మాత్రం న్యూఇయర్ సెంటిమెంట్ కి భయపడిపోతున్నారు.(బ్రహ్మోత్సవం కూడా న్యూఇయర్ కి ఫస్ట్ లుక్ వచ్చి డిజాస్టర్ అయినందుకు). మొత్తానికి ఆ డేట్ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోవటంతో ఆ మధ్యలో కూడా టైటిల్ పై ఓ స్పషత వచ్చే అవకాశం లేకపోలేదు.

ఇక తొలిసారి వందకోట్ల బడ్జెట్ తో మురగదాస్ లాంటి దర్శకుడితో జోడీ కడుతుండటం, పైగా ఐబీ ఆఫీసర్ గా కనిపించబోతుండటం, ఇప్పటికే లీకైన ఫోటోలు సూపర్బ్ గా ఉండటంతో వీటన్నింటితో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయ్. ఏప్రిల్, కుదరకపోతే మే లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  AR Murugadoss  Untitled movie  new year firstlook  

Other Articles