నాపై సెటైర్ వేశారు.. నేను ఉన్నాను కాబట్టే బతికాడు అన్నాను.. అంతే ... | Srinivasreddy NTR a untold story.

Srinivasreddy about junior ntr

Srinivas Reddy, Jayammu Nishyammura Interview, Junior NTR Srinivas Reddy, NTR Accident, Srinivas reddy about NTR accident

Star Comedian Srinivas Reddy revealed Why Junior NTR not talk with him.

ఎన్టీఆర్ తో ఎందుకు గొడవ పడ్డాడు?

Posted: 11/26/2016 01:29 PM IST
Srinivasreddy about junior ntr

స్టార్ కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన శ్రీనివాసరెడ్డికి ఇండస్ట్రీలో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆల్ హీరోస్ తో అనుబంధం పెనవేసుకుపోయిన రెడ్డికి ఇండస్ట్రీలో ఒకే ఒక్క టాప్ హీరో తో మాటల్లేవ్ అంట. అది ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆరేనని చెప్పాడు. దానికి కారణం ఎన్టీఆర్ కు జరిగిన యాక్సిడెంటేనంటూ ఫ్లాష్ బ్యాక్ చెబుతున్నాడు.

‘‘తారక్ తో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. నేను.. తను.. రాజీవ్ కనకాల కలిసి క్రికెట్ ఆడేవాళ్లు. 2009 ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ తో పాటు ఉన్న బ్యాచ్ లో నేనూ ఉన్నాను. నేను ఖమ్మం సభకు వాళ్లతో కలిశాను. సభ అయ్యాక కార్లలో హైదరాబాద్ బయల్దేరాం. ముందు కార్లో ఎన్టీఆర్.. మరికొందరు స్నేహితులు బయల్దేరారు. మేం వెనుక కార్లో ఉణ్నాం. కొంతదూరం వెళ్లాకక ఎన్టీఆర్ కారుకు యాక్సిడెంట్ అయింది. మేం కారు దగ్గరికెళ్లి చూస్తే అందులో ఎన్టీఆర్ లేడు.

పక్కన బాగా దుమ్ముపట్టిన బట్టలతో గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉన్నాడు. ఏంటన్నా అంటే.. రక్తం వస్తోందంటూ తల భాగం చూపించాడు. బ్యాగులో ఉణ్న టవల్ తీసి తలకు చుట్టేసి మా కార్లో ఎక్కించాం. సూర్యాపేటలో మా అక్కవాళ్లుంటారు. వాళ్లకు ఫోన్ చేసి ఏ హాస్పిటల్ బాగుంటుందో అడిగి తెలుసుకున్నా. అక్కడికెళ్లి ఆసుపత్రిని రౌండప్ చేశాం. పేషెంట్స్ తప్ప ఎవరూ లేకుండా చేశాం. తారక్ కు కుట్లు వేయడానికి డాక్టర్ చేతులు వణికాయి. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి హైదరాబాద్ కిమ్స్ కు తీసుకొచ్చారు.

అక్కడున్న మా బ్యాచ్ లో ఒకడు నేను అడుగుపెట్టడం వల్లే యాక్సిడెంట్ అయింది అన్నాడు. చాలా బాధనిపించి వెంటనే రిటార్ట్ ఇచ్చాను. ‘‘నేను ఉన్నాను కాబట్టే ప్రాణాలతో బయటపడ్డాడు.. లేకపోతే ఇంకేమయ్యేదో’’ అని అన్నాను. ఆ మాటను వాళ్లు మరో రకంగా ఎన్టీఆర్ కు చెప్పారేమో అప్పటి నుంచి మా మధ్య మాటల్లేవ్. చివరికి పటాస్ పంక్షన్ లో కూడా జూనియర్ తనతో మాట్లాడలేదన్నాడు. అయితే ఏదో ఒక రోజు ఎన్టీఆర్ ను కలిసి మాట్లాడి ఆ గ్యాప్ తగ్గిస్తా అంటూ శ్రీనివాస్ రెడ్డి చెప్పుకోచ్చాడు. ప్రస్తుతానికైతే జయమ్ము నిశ్చయమ్మురా సక్సెస్ టాక్ రావటంతో ఎంజాయ్ చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srinivas reddy  NTR  Accident  

Other Articles