ధృవ ట్రైలర్ లో ఆ ఒక్క ఛేంజ్.. మిగతాదంతా సేమ్ టూ సేమ్ | Ram Charan Dhruva trailer review.

Dhruva official trailer released

Ram Charan, Dhruva Official Trailer, Aravind Swamy, Dhruva Telugu Movie, Tani Oruvan telugu remake,Cherry Dhruva Trailer

Ram Charan Dhruva Official Trailer Released, Aravinda Swamy says to Cherry "Love You Sweet Heart".

ధృవ ట్రైలర్ కూడా హడావుడి లేకుండానే...

Posted: 11/26/2016 07:45 AM IST
Dhruva official trailer released

మెగా పవర్ స్టార్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ ధృవ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది. శుక్రవారం సాయంత్రం ఓ అఫీషియల్ మీటింగ్ పెట్టి మరీ నిర్మాత అల్లు అరవింద్ దీనిని లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సురేందర్ రెడ్డి, హీరోయిన్ రకుల్ ప్రీత్ పాల్గొన్నారు.

ఇక ట్రైలర్ విషయానికొస్తే... తమిళ్ చిత్రం తని ఒరువన్ ను యాజ్ ఇట్ ఈజ్ గానే తీసినట్లు అనిపిస్తున్నప్పటికీ, హీరో క్యారెక్టర్ ను ఇక్కడ ఎక్కువ ఎలివేట్ చేసినట్లు స్పష్టమౌతుంది. రాంచరణ్ ను ట్రైలర్ ఓపెనింగ్ లో చూపించిన తీరే ఇందుకు ఎంగ్జాంపుల్. ఐపిఎస్ ఆఫీసర్ ధృవకు ఓ టార్గెట్ ఉంది. ఒక్కొక్క చిన్న క్రిమినల్ తో తలపడే బదులు.. ఏ క్రిమినల్ ను అయితే అంతం చేస్తే 100 మంది క్రిమినల్స్ అంతం అవుతారో.. అతడే నా టార్గెట్ అంటూ పని మొదలుపెడతాడు. తెర వెనుకాల ఉండి రాజకీయ నాయకులను నడిపించే అదృశ్యశక్తి సైటింస్ట్ సిద్దార్ద్ అభిమన్యు(అరవింద్ స్వామి) ధృవ టార్గెట్ అవుతాడు. ఆపై ఇద్దరి మధ్య జరిగే మైండ్ గేమ్, చివరికి ఎవరు గెలుస్తారు అన్నదే కథ.

 

సినిమా మేకింగ్ అంతా స్టయిలిష్ అండ్ క్లాస్ గా అదిరిపోయిందంతే. రామ్ చరణ్ కూడా ఐపీఎస్ ఆఫీసర్ గా, అరవింద స్వామి ఇద్దరూ తమ ఎక్స్ ప్రెషన్లతో అదరగొట్టాడు. తన గోల్ వేరే ఉందంటూ రకుల్ తో చెర్రీ చెప్పే డైలాగ్, ఎప్పుడూ మంచే జరగటం దేవుడికి కూడా ఇష్టం ఉండదంటూ అరవింద స్వామి చెప్పే డైలాగ్.. ముఖ్యంగా ''లవ్ యు స్వీట్ హార్ట్'' అంటూ చెప్పటం అంతా సూపర్బ్ గా ఉంది. కెమెరా పనితనం, హిప్ హాప్ తమీజ్ సంగీతం అన్నీ కుదిరాయి. మొత్తానికి ట్రైలర్ తో ధృవ బాగానే ఇంప్రెస్ చేయటమే కాదు, తెల్లారికల్లా మిలియన్ వ్యూవ్స్ దాటేసింది కూడా.

ఇక ప్రమోషన్ల విషయానికొస్తే ధృవ వ్యవహారం అంతా చాలా గోప్యంగానే అయిపోతుంది. మాములుగా మెగా ఈవెంట్ కు ఉండాల్సిన లక్షణాలు కనిపించటం లేదు. ఆడియోను డైరెక్టుగా మార్కెట్లోకి వదిలేయడమే కాదు.. ఇప్పుడు ట్రైలర్ లాంఛ్ కూడా జస్ట్ నెట్లో రిలీజ్ చేసేశారంతే. గోవిందుడు అందరివాడేలే.. బ్రూస్ లీ లాంటి ఫ్లాప్స్ తర్వాత.. వస్తున్న సినిమా కావటం, ఎక్స్ పెక్టేషన్స్ పెంచితే అంచనాలు తారు మారు అయిపోయే అవకాశం ఉందన్న ఆలోచనతోనే చెర్రీ ఇలా చేస్తున్నాడని టాక్.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan  Dhruva Official Trailer  

Other Articles