జూనియర్ ఎవరో తెలీదన్న స్టార్ దర్శకుడు.. ఫ్యాన్స్ బూతు పురాణం | NTR fans fire on director Hari.

Director hari comments on junior ntr

Junior NTR, Director Hari, NTR HAri, Singham director NTR, star director NTR, Junior NTR, Hari about NTR, Hari comments on NTR

Junior NTR fans fire on Kollywood Director Hari.

ఎన్టీఆర్ పై సింగం దర్శకుడి కామెంట్లు

Posted: 11/25/2016 09:54 AM IST
Director hari comments on junior ntr

తెలుగులో ఇప్పుడున్న యంగ్ స్టర్ లలో డైలాగ్ డెలివరీ, మాస్ ఇమేజ్ లో కింగ్ ఎవరంటే... జూనియర్ ఎన్టీఆర్ అని ఒప్పుకుని తీరాల్సిందే. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులతో తెరపైకి ఎంట్రీ ఇచ్చిన తారక్ సినిమా సినిమాకి బ్లాక్ బస్టర్లు కొడుతూ క్రమంగా తన రేంజ్ ను పెంచేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. మొన్న వచ్చిన జనతా గ్యారేజ్ అందుకు నిదర్శనం.

గ్యారేజ్ సాధించిన కలెక్షన్ల మాట అటుంచి సౌత్ మొత్తం ఎన్టీఆర్ గురించే డిస్కషన్లు మొదలుపెట్టింది. ఓ దశలో తమిళ దర్శకులు కూడా యంగ్ టైగర్ తో సినిమాలు తీసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారంటూ వార్తలు మొదలు అయ్యాయి. ఈ క్రమంలోనే మాస్ దర్శకుడు, సూర్య సింగం సినిమాల దర్శకుడు హరి కూడా ఓ కథతో ఎన్టీఆర్ ను అప్రోచ్ అయ్యాడంటూ వార్తలు వచ్చాయి.

అయితే ప్రస్తుతం సూర్య సింగం-3 ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఉన్న హరి ఓ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ఉందా? అన్న ప్రశ్నకు. అస్సలు జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తనకు తెలీదంటూ, ఎప్పుడూ కలవలేదంటూ, ఆ పేరు ఇప్పుడే వింటున్నానంటూ వ్యాఖ్యలు చేశాడు. అంతే దెబ్బకి జూనియర్ ఫ్యాన్స్ గరం అయ్యారు. సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ హరి గురించి వల్గర్ కామెంట్లు చేసేస్తున్నారు. తమ హీరో సత్తా తెలియాలంటే అడ్రస్ చెప్పు  సినిమా సీడీలు పంపుతాం అంటూ మండిపడుతున్నారు.

మంచి స్టార్ డమ్ ఉన్న ఎన్టీఆర్ గురించి సౌత్ సినీ పరిశ్రమల్లో తెలియని వారుండరు. అలాంటిది ఎన్టీఆర్ ఎవరంటూ హరి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర దుమారమే రేపుతోంది. చూద్దాం మరి ఈ దర్శకుడు ఆ కామెంట్లను ఎలా కవర్ చేస్తాడో?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior NTR  Singham Director  Hari  Comments  

Other Articles