ధృవ నీతోనే మేకింగ్ వీడియోతో కొత్త రికార్డు | Dhruva Nethone song making video new record

Ram charan dhruva nethone song new record

Ram Charan Dhruva, Ram Charan Neethone Song, Neethone Song Making Video, Dhuruva Making Videos, Dhuruva making Video, Stars at Neethone Song Making Video

Ram Charan Dhruva's Neethone Song making video creates new record

చెర్రీ ధృవ మరో రికార్డు

Posted: 11/14/2016 10:19 AM IST
Ram charan dhruva nethone song new record

మెగాపవర్ స్టార్ మరోసారి తన సత్తా చాటాడు. ధృవ సినిమా టీజర్ల ఓవైపు ట్రెండ్ సెట్ చేస్తుంటే.. మరోవైపు మరో అరుదైన రికార్డును చెర్రీ అందుకోబోతున్నాడు. ధృవ సినమాలో ఉన్న ఏకైక డాన్సింగ్ సాంగ్ నీతోనే మేకింగ్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. అర మిలియన్ వ్యూవ్స్ తో మేకింగ్ వీడియోలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

నీతోనే డ్యాన్స్ అంటూ రామ్ చరణ్ డ్యాన్సులేస్తుంటే.. షూటింగ్ స్పాట్ కి బోలెడంత మంది సెలబ్రిటీలు హంగామా చేశారో.. రీసెంట్ గా విడుదల చేసిన ఆ పాట మేకింగ్ వీడియో చూస్తే అర్ధమవుతుంది.  మెగాస్టార్ చిరంజీవి.. చెర్రీ పక్కపక్కనే కూర్చునే కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్న విజవల్, ఉపాసనకు ఫోన్ లో చెర్రీ ఏదో చూపించటం, సెట్స్, చెర్రీ డ్యాన్స్ ప్రాక్టీస్.. రకుల్ ప్రీత్ అందాలు.. వీడియోకు మరింత కళ తీసుకొస్తే.. సాంగ్ షూటింగ్ కు వచ్చిన గెస్ట్ లే అసలు పాయింట్ అవుతోంది.  

స్టార్ డైరక్టర్లు, హీరోలు ఆ పాట షూటింగ్ స్పాట్ లో సందడి చేశారు. నిర్మాత అల్లు అరవింద్ తనయులు అల్లు అర్జున్.. అల్లు శిరీష్ లు, అక్కినేని అఖిల్, శృతి హాసన్.. దర్శకులు వివి వినాయక్, సుకుమార్; కొరటాల శివలతోపాటు ధృవ దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఇందులో కనిపించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Dhruva Song  Neethone Song  Making Video  

Other Articles