జక్కన్న కోసం ఏమైనా చేస్తా.. తండ్రి- కొడుకులతో చేస్తే తప్పేంటి? | kajal about baahubali and chiru 150.

Kajal ready for baahubali 3

Kajal about act with father and son, Kajal about Chiru and Cherry, Kajal 150th movie, Kajal baahubali 3, Kajal about baahubali, Kajal about Chiru and Charan

Kajal ready for Baahubali 3 if Rajamouli make a call, and about Chiru and Cherry.

రాజమౌళి కోసం అన్ని వదిలి పరిగెడతా

Posted: 11/07/2016 09:24 AM IST
Kajal ready for baahubali 3

పదేళ్ల కెరీర్ లో కాజల్ లైఫ్ లో గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్ మాత్రం మగధీర నే. అప్పటికీ సక్సెస్ రేటు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, రాజమౌళి పుణ్యమాని స్టార్ హీరోయిన్ కేటగిరీతపాటు, యూత్ లో పిచ్చ క్రేజ్ సంపాదించేసుకుందీ కలువ కళ్ల చందమామ. అక్కడి నుంచి వరుసగా తెలుగుతోపాటు, తమిళ్ లో కూడా ఏకథాటిగా ఏడేళ్లు ఫుల్ బిజీ బిజీ. మరి అలాంటి దర్శకుడి నుంచి మళ్లీ పిలుపు వస్తే...

ఒకవేళ బాహుబలి-3 కోసం రాజమౌళి పిలిస్తే వెళతారా అని ప్రశ్నించిన మీడియాకు కాజల్ నో డౌట్ అనే సమాధానం ఇచ్చింది. ఒకవేళ 'బాహుబలి 3' ఉండి, అందులో నాకు ఓ అవకాశం ఇచ్చి పిలిస్తే, ఈ ప్రపంచంలో దేన్నైనా వదులుకుని పరుగు పెడతా. ఈ స్థాయి సినిమాలు భారీ ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి, ఎక్కువ రావు" అని చెప్పుకొచ్చింది. మరి బాహుబలిలో ఎందుకు నటించలేకపోయారని ప్రశ్నిస్తే.. అది రాజమౌళిగారి సినిమా. ఆయన తన చిత్రంలో ఏ పాత్రకు ఎవరు సరిపోతారో వారిని మాత్రమే సెలక్ట్ చేసుకుంటారు. అయినా బాహుబలిలో నటించలేదన్న బాధ నాకు లేదు అని చెప్పుకొచ్చింది.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై మీడియా తనయుడు రాంచరణ్ తో కూడా చేశారు కదా అని ప్రస్తావిస్తే... నేను ఒక నటిని. ఎవరితోనైనా నటించాలి. అది నా వృత్తి కూడా. అలాంటప్పుడు తారతమ్యాలు చూడాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇక బాలీవుడ్ సినిమాల గురించి చెబుతూ.. ప్రస్తుతానికి తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉన్నానని, హిందీ చిత్రాలకు కొంత దూరంగానే ఉన్నానని చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kajal Agarwal  Rajamouli  Baahubali 3  Chiranjeevi 150th movie  Ram Charan  

Other Articles