ఆమె ర్యాంప్ వాక్ ను బిగ్ బీ వీడియో తీశాడు | Amithab Bachchan filmed his daughter ramp walk

Bachchan cheer at shweta nanda ramp walk

Amithabh Bachchan daughter Shweta Nanda ramp walk, swetha Nanda ramp walk, Swetha nanda ramp walk at Sandeep Khosla show, Sandeep Khosla ramp walk, Bachchan family at Sandeep Khosla show

Amithabh Bachchans Cheer For Shweta Nanda As She Walks The Ramp.

కూతురి ర్యాంప్ వాక్ తో బిగ్ బీ తన్మయం

Posted: 11/05/2016 09:58 AM IST
Bachchan cheer at shweta nanda ramp walk

టాలీవుడ్ లో సినీస్టార్ల వారసులు ఈ మధ్య గ్యాప్ లేకుండా వచ్చేస్తున్నారు. ఇప్పటికే మెగా, నందమూరి, అక్కినేని, ఘట్టమనేని వారసులు సెటిల్ అయిపోగా, మరికొందరు ఆ జాబితాలోకి చేరే అవకాశం ఉంది. అయితే బాలీవుడ్ మాత్రం ఈ విషయంలో చాలా స్లోగా ఉందనే చెప్పుకోవాలి. స్టార్ల కొడుకులు, కూతుళ్లు వయసుకి వచ్చినప్పటికీ, వారిని హోల్డ్ లో పెడుతూ వస్తున్నారు.

షారూఖ్, సైఫ్ అలీ ఖాన్, శ్రీదేవీ ఇలా వారి వారసులంతా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. అయితే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తనయ శ్వేత మాత్రం ఇప్పుడు ర్యాంప్ వాక్ లతో అదరగొడుతోంది. సినిమాలను కాదని, నిఖిల్ నందా అనే బడా బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకున్న శ్వేతా లో ఫ్రోఫైల్ జీవితం గడుపుతూ వస్తోంది. కానీ, మధ్య మధ్యలో ఫోటో షూట్ లు, ర్యాంప్ వాక్ లలో పాల్గొంటూ ఆకట్టుకుంటోంది. ఇక తాజాగా సందీప్ కోస్లా ర్యాంప్ వాక్ లో మెరవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 42 ఏళ్ల శ్వేతా నందా తెల్లని వస్త్రాలు ధరించి తళుక్కున మెరిశారు. అంతేకాదు ఈ షోలో ఆమె టాపర్గా నిలిచారు.

శ్వేత పాల్గొన్న ఫ్యాషన్ షోను తిలకించేందుకు ఆమె తల్లిదండ్రులు జయా బచ్చన్, అమితాబ్ బచ్చన్ విచ్చేశారు. అభిషేక్ బచ్చన్ కూడా ఈ షోకు వచ్చి సోదరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ షోలో శ్వేత నడుస్తున్నప్పుడు అమితాబ్ మొబైల్తో వీడియో తీశారు. షూటింగ్తో బిజీగా ఉన్నా అభిషేక్ తీరిక చేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చారు. బచ్చన్ కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే, దర్శకుడు అభిషేక్ కపూర్, ఆమె భార్య ప్రగ్నా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇక శ్వేతా తనయ, బిగ్ బీ మనవరాలు 19 ఏళ్ల నవ్యా నవేలి నందా మాత్రం అతి త్వరలో ఇండస్ట్రీలో ఆరంగ్రేటం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె కోసం కథ సిద్ధం కాగా, అతి త్వరలో అనౌన్స్ మెంట్ చేయబోతున్నారంట.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amithab Bachchan Daughter  Swetha Bachchan Nanda  Ramp walk  

Other Articles