అమలను ధనుష్ కూడా మోసం చేశాడా? | no big heroes for Amala Paul in kollywood.

No big heroes for amala paul

Allari Naresh Amala Paul, Amala Paul second innings in tollywood, amala paul dhanush, Dhanush also cheat Amala Paul, Amala Paul no movies in kollywood, tollywood small heroes rope for Amala Paul

Amala Paul no kollywood offers, tollywood small heroes que for her.

అమల పేరు చెబితే టాప్ హీరోలు వణికిపోతున్నారు

Posted: 10/31/2016 08:48 PM IST
No big heroes for amala paul

భర్తతో మనస్పర్థలు తలెత్తిన తరువాత అమలా పాల్ కెరియర్ పై మరింత శ్రద్ధ పెట్టింది. అయితే ఈ క్రమంలో అమలకు ఊహించని ట్విస్ట్ లే ఎదురవుతున్నాయి. కోలీవుడ్ లో ఏకంగా రజనీకాంత్ చిత్రంలో అవకాశం లభించిందని ఫ్రెండ్, హీరో ధనుష్ హమీ ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం ఆ ప్రాజెక్టు సస్పెన్స్ లో ఉండటంతో అమలకు చేతిలో ఇప్పుడేం అవకాశాలు లేకుండా పోయింది. మరోవైపు భర్త విజయ్ కి వ్యతిరేకంగా ఆమెకు ఆఫర్లు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు.

అయితే తెలుగు సినిమా దర్శక నిర్మాతలు కూడా ఆమెను తమ సినిమాలో తీసుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. అల్లరి నరేష్ చేయనున్న ఒక సినిమా కోసం కథానాయికగా ఆమెను సంప్రదిస్తున్నట్టుగా వినికిడి. అనీష్ కృష్ణ దర్శకత్వంలో అల్లరి నరేష్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం అమలా పాల్ ను సంప్రదిస్తున్నారు. అమలా పాల్ ఆన్సర్ ఏంటనేది మూడు నాలుగు రోజుల్లో తేలిపోతుందని అంటున్నారు. మలయాళంలో విజయం సాధించిన ఓ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.

మరోవైపు విష్ణుతో ఓ సినిమాలో అమలాపాల్ నటించబోతుంని కొంత కాలంగా టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా భర్తతో బ్రేకప్ అయ్యాక భారీ అవకాశాలే ఆమె తలుపు తడతాయని భావించిన అమలకు, ఇలా వరుస ఫ్లాపులలో ఉన్న హీరోల సినిమాల్లో అవకాశం రావటం ఎవరూ ఊహించి ఉండరేమో. ఇదిలా ఉండగా కన్నడ వీఐపీ (తెలుగులో రఘువర్ బీటెక్ ) వర్షన్ లో కూడా అమలనే హీరోయిన్ గా నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amala Paul  Tollywood movies  Allari Naresh  Vishnu movies  

Other Articles