నా మొగుడు అందగాడు.. కాబట్టే నాపై విమర్శలు | Ram Charan's wife stunning reply on Controversies

Upasana stunning reply on beauty controversies

Ram Charan's wife Upasana on Beauty, Upasana stunning reply on Controversies, Upasana comments, Upasana Kamineni counter to critics, Upasana about personal life, Ram Charan Upasana about Kids

Ram Charan's wife stunning reply on Controversies.

నా భర్త అందగాడు... అందుకే నాకీ సమస్యలు

Posted: 10/26/2016 11:55 AM IST
Upasana stunning reply on beauty controversies

మెగా పవర్ స్టార్ రాంచరణ్ వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలు ఈనాటివి కావు. గ్లామర్ విషయం దగ్గరి నుంచి వైవాహిక జీవితంపై కూడా సోషల్ మీడియాలో దారుణమైన వ్యాఖ్యలు, పంచ్ లు, ఫోటోలతోసహా సందేశాలు చాలానే ఉంచారు. చెర్రీని అందంగా తయారు చేయడానికి వాళ్ల అమ్మ చాలా కష్టపడిందని యండమూరి లాంటి వాళ్లు కామెంట్లు చేయటంతో కొంత మంది రెచ్చిపోయి మార్ఫింగ్ ఫోటోలతో సహా కసి తీర్చుకున్నారు.

అయితే పెళ్లి సమయంలో భార్య ఉపాసనను కూడా వదలకుండా ఫేస్ బుక్ లలో కొన్ని ఫోటోలు దర్శనమిచ్చాయి. అందులో మెగా అభిమానులు కూడా ఉండటమే అసలు కొసమెరుపు. సాధారణంగా ఈ స్థాయి విమర్శలను టచ్ చేయాలని ఏ సెలబ్రిటీ కూడా ప్రయత్నించడు. కానీ, మెగా కోడలు ఉపాసన మాత్రం చాలా డేర్ గా ఈ అంశంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ‘‘నాపై, నా భర్తపై చేసే ప్రతీ కామెంట్ ను నేను పాజిటివ్ గానే చూస్తాను. నా భర్త అందగా ఉండటం, పైగా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటం మూలంగానే, బెటర్ గర్ల్ ఆయన జీవితంలో ఉండాలని కోరుకుంటున్నారేమో. వాటన్నింటిని నేను చాలా తేలిగ్గా తీసుకుంటాను’’ అంటూ నోర్లు మూతలు పడేలా రిప్లై ఇచ్చింది.

ఇక అఫైర్ల గురించి, విడాకుల రూమర్ల గురించి అంటారా? ఎవరి పని వాళ్లు సక్రమంగా చేసుకుంటే ఇలాంటి వాటి గురించి ప్రస్తావన ఉండదు అని చెప్పింది. అయినా చారిటీ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఇంకోపక్క అపోలో లాంటి ప్రఖ్యాత ఆస్పత్రుల వ్యవహారాలను ఒంటి చేత్తో చూసుకుంటున్న ఉపాసన లోని అందం అనే కోణాన్ని మాత్రమే లేవనెత్తటం ద్వారా చులకన అవటం తప్పించి వారు సాధించేది ఏం ఉండదని గుర్తుంచుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Wife Upasana Konidela  Personal Life  

Other Articles

Today on Telugu Wishesh