రంభ కాపురంలో కలతలు ఎలా రేగాయి? | Actress Rambha battling to save her marriage

Actress rambha battling to save her marriage

Actress Rambha approached Chennai Family Court, Actress Rambha Divorce, Rambha Divorce, Rambha Family, Rambha with Daughters, Rambha with Husband, Actress Rambha Indiran Padmanabhan

Actress Rambha approached Chennai Family Court.

ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన నటి రంభ

Posted: 10/26/2016 07:47 AM IST
Actress rambha battling to save her marriage

సౌత్ లో విడాకుల కోర్టు మెట్లు ఎక్కిస్తున్న హీరోయిన్ల సంఖ్య రాను రాను పెరిగిపోతుంది. అమలాపాల్, లిజీ, సౌందర్య రజనీకాంత్ ఇప్పుడు మరో టాప్ నటి కూడా అందులో చేరిపోతుందా అన్న అనుమానాలు కలగకమానవు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగి, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రముఖ సినీ నటి తన వైవాహిక జీవితాన్ని నిలబెట్టుకునేందుకు పోరాడబోతుంది. తాజాగా చెన్నైలోని ఫ్యామిలీ కోర్టును ఆమె ఆశ్రయించింది. భర్త ఇందిరన్ పద్మనాభన్ నుంచి గత కొంత కాలంగా ఆమె విడిగా ఉంటున్న విషయం తెలిసిందే.

అయితే తాను ఇప్పుడు తన భర్తతో కలిసి ఉండాలనుకుంటున్నానని, అందుకు వీలు కల్పించాలని కోరుతూ రంభ చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం హక్కులు కల్పించాలని కోర్టును కోరగా, విచారణ కోసం డిసెంబర్ 3కి కేసు వాయిదా వేసింది.

తెలుగుతోపాటు కోలీవుడ్, బాలీవుడ్, మల్లూ వుడ్ లో రాణించిన రంభ 2010 ఏప్రిల్ లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇందిరన్ పద్మనాభన్ ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు(లాన్య, సాసా ఇద్దరు అమ్మాయిలే). ఆ మధ్య భర్త వ్యాపారంలో చేదుడు వాదోడుగా ఉంటు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేసిన రంభ, కారణాలు తెలియదు గానీ గత కొంత కాలంగా మాత్రం వేరుగా నివసిస్తోంది. అయితే తమ కాపురంలో ఎలాంటి కలతలు లేవని కోర్టుకు హాజరైన రంభ వ్యాఖ్యానించడం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Rambha  Divorce  Chennai Family court  

Other Articles