చేతిలో సినిమాలు లేని బ్రహ్మీ ఏం చేస్తున్నాడు? | Brahmi turns mentor for his Son Gautam's next movie.

Brahmi busy with his son s next movie

Brahmi Yunger Son also Hero, Brahmi turns mentor for his Son, No movies for Brahmi, Navvula Don No Movies, Brahmi Second son as Hero, Brahmi youngest son debut, Brahmi Son Gautam fourth Movie, Phanindra Gautam Movie, Brahmi Tollywood offers, Brahmi second son name, Brahmi turns mentor for his sons, Brahmi sons

Actor Brahmi turns mentor for his Son Gautam's next movie and also planned for Younger Son's Debut.

బ్రహ్మీ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?

Posted: 10/25/2016 01:38 PM IST
Brahmi busy with his son s next movie

మూడు దశాబ్దాలు ఏలిన బ్రహ్మీ హాస్య రసంపై తెలుగు ప్రేక్షకుడికి విగటు పుట్టింది. ఎంత సేపు ఒకే బకరా టైపు వేషాలు ఆయన్ని పలకరించడం, ఇంకెన్నీ సార్లు చేస్తావయ్యా అంటూ ప్రేక్షకుడు తప్పికొట్టడం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ లో కొత్త కమెడియన్లకు ఆదరణ లభించడం, పైగా థర్టీ ఇయర్స్ పృథ్వీ, వెన్నెల కిషోర్ లాంటి వాళ్లు ఆ ప్లేస్ ను భర్తీ చేస్తుండటంతో బ్రహ్మీకి పెద్దగా పని లేకుండా పోయింది.

ఈ మధ్య సర్దార్ గబ్బర్ సింగ్, జాగ్వార్ లాంటి భారీ బడ్జెట్ సినిమాల్లో కనిపించినప్పటికీ, అవేం బ్రహ్మీకి కొత్త అవకాశాలు కల్పించలేకపోయాయి. టోటల్ గా బ్రహ్మీ అయిపోయాడు అనే ఓ నిర్ధారణకు వచ్చేశారంతా. అయితే తన పనేం అయిపోలేదని, రాబోయే సినిమాలతో తన సత్తా ఏంటో చూపిస్తానంటున్నాడు. ఇదిలా ఉంటే గతంలో తన కొడుకు గౌతమ్ ను హీరోగా చేయాలన్న బ్రహ్మీ ప్రయత్నాలు అస్సలు వర్కవుట్ కాలేదు. మూడుకు మూడు సినిమాలు కూడా ఇలా వచ్చి అలా పోయాయి. ఇప్పుడు నాలుగో ప్రయత్నంలో కూడా ఉన్నాడు. కాకపోతే ఏ మాత్రం గుట్టుచప్పుడు కాకుండా, అంచనాలు లేకుండా దానిని ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నాడు.

మధురం అనే షార్ట్ ఫిల్మ్ తీసిన ఫణీంధ్ర దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎలాగూ తెలుగులో సినిమాలు లేకుండా బ్రహ్మీ ఎక్కువ సమయం కొడుకు సినిమా సెట్లో గడుపుతూ ఉచిత సలహాలు ఇస్తున్నాడంట. అంతేకాదు త్వరలో తన చిన్న కుమారుడిని కూడా సినిమాల్లోకి తీసుకొచ్చేందుకు నవ్వుల డాన్ ప్రయత్నాలు అల్రెడీ ప్రారంభించాడంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brahmanandam  No Movie  Turns Mentor  Son Gautam Movie  

Other Articles