కుష్బూ.. నమిత... హన్సిక... కీర్తి సురేష్ | Kollywood fans ready to fan club for Keerthy Suresh

A fan club for keerthy suresh

Fans club set up in Kollywood for Actress Keerthy Suresh, Fans club for Keerthy Suresh, Keerthy Suresh fans club, Keerthy Suresh did it short time, Kollywood Fans madness on Actress, Kushboo Trisha Hansika Namitha Keerthy Suresh

Fans club set up in Kollywood for Actress Keerthy Suresh.

కీర్తి సురేష్ టూ మచ్ కదా?

Posted: 10/25/2016 12:26 PM IST
A fan club for keerthy suresh

తారలను అభిమానించే విషయంలో దేశంలో కోలీవుడ్ ప్రేక్షకులను మించిన వారు ఎవరూ ఉండరు. ఎంజీఆర్ మొదలు దశాబ్దాల తరబడి ఈ ఆచారం కొనసాగుతూ వస్తోంది. తలైవాకు పాలాభిషేకం దగ్గరి నుంచి ఇదయదళపతి పేరిట సేవా కార్యక్రమాల దాకా ఎందులోనూ వారు అస్సలు వెనక్కి తగ్గరు.  సోషల్ మీడియాలో తిట్లు, రోడెక్కి కొట్టుకునే వేషాలు వారి దగ్గర కూడా ఉంటాయి లేండి.

ఇక హీరోయిన్ల విషయంలో మాత్రం అక్కడి అభిమానులది విచిత్రమైన వైఖరి(దాన్ని పైత్యం అని కూడా అనుకోండి). 90వ దశకంలో కుష్బూకి ఏకంగా గుడి కట్టి పూజలు చేసి పడేశారు. ఆ తర్వాత హీరోలకు ఉన్నట్లే వారికి ఫ్యాన్స్ క్లబ్ పెట్టి కార్యక్రమాలు చేయటం ప్రారంభించారు. 9 ఏళ్ల క్రితం త్రిషకు అక్కడ ఫ్యాన్ క్లబ్ పెట్టడం ద్వారా ఆ అరుదైన ఘనత సాధించింది. ఇక ఆపై తెలుగు నుంచి తరలివెళ్లిన నమితకు, లేత వయసులోనే సినిమాలకు దిగిన హన్సికకు కూడా కుష్బూకి చేసినట్లే పూజలు చేయటం ప్రారంభించారు. వాళ్ల సినిమాల రిలీజ్ సమయంలో హీరోలకు పోటీగా సెపరేట్ బ్యానర్ లు పెట్టి కోలాహలం చేయటం చూశాం. ఇక ఇప్పుడు కీర్తి సురేష్ ను కూడా ఆ జాబితాలోకి చేర్చి పడేశారు.

కోలీవుడ్ లో కుర్ర హీరో శివకార్తీకేయన్ తో రజనీ మురుగున్, రెమో లాంటి బ్యాక్ టూ బ్యాక్ రెండు హిట్లు కొట్టిన కీర్తి సురేష్, మధ్యలో ధనుష్ తో తొడరి( తెలుగులో రైల్) అట్టర్ ఫ్లాప్ ను అందించింది. ప్రస్తుతం ఏకంగా విజయ్ తో భైరవా సినిమాలో నటిస్తోంది. అయితే పైన చెప్పుకున్న భామలతో ఏ మాత్రం కీర్తిని కంపేర్ చేయటం లేము. చేసింది కేవలం నాలుగే సినిమాలు. వాటిలో నటన అంతంత మాత్రమే. అయినా ఫ్యాన్స్ క్లబ్ పెట్టి పూజలు చేసేందుకు రెడీ అయిపోతున్నారు. ఇంతకీ మన శైలజలో వాళ్లు అంతగా ఏం చూశారాంటారు?  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Keerthy Suresh  Fans Club  TamilNadu  

Other Articles

Today on Telugu Wishesh