ఉదయ్ కిరణ్ సూసైడ్ వెనుక ఉన్న రచయిత ఎవరు? | Allari Naresh interesting point on Uday Kiran's Death

Allari naresh interesting point on uday kiran s death

Allari Naresh interesting point on Uday Kiran's Death, Uday Kiran's deah mystery, Allari Naresh Uday Kiran, Uday kiran feels about that article, That Article reason for Uday Kiran's Suicide

Allari Naresh interesting point on Uday Kiran's Death. Days before Uday feels about an article about his reference to a flop hero.

ఉదయ్ కిరణ్ అందుకు కూడా చనిపోయి ఉండొచ్చు!

Posted: 10/24/2016 02:58 PM IST
Allari naresh interesting point on uday kiran s death

లవర్ బాయ్ గా వెలుగొందిన ఉదయ్ కిరణ్ కెరీర్ లో ఆటుపోటులు ఎదుర్కనే ధైర్యం చాలక బలవన్మరణానికి పాల్పడి తెలుగు సినీ పరిశ్రమ మొత్తం షాక్ కి గురయ్యేలా చేశాడు. ఓవైపు కెరీర్ ముందుకు సాగకపోవటం, మరోవైపు కుటుంబ సంబంధమైన సమస్యలు వెరసి అతన్ని ఆత్మహత్యకు ఉసిగొల్పి ఉండొచ్చు. అతని భార్యతోసహా ఇండస్ట్రీలో ఎవరూ కూడా ఈ విషయంలో ఆపై నోరు మెదిపిన దాఖలాలు లేవు. కానీ, ఉదయ్ కి అత్యంత సన్నిహితంగా ఉండే మరో హీరో అల్లరి నరేష్ సూసైడ్ కి ముందు జరిగిన ఓ ఘటనను తెలియజేస్తున్నాడు.

చనిపోయే కొన్ని రోజుల ముందు ఉదయకిరణ్‌ నన్ను కలిశాడు. ఎందుకో అతని ముఖంలో దిగులు, బాధ కనిపించాయి. ఎందుకు అలా ఉన్నావ్ ? అని అడిగా ‘‘ఏమీలేదు నరేష్‌, పొద్దున్నే ఒక ఆర్టికల్‌ చదివాను. అందులో ఒక యువహీరో కథల్ని సరిగా ఎంచుకోవట్లేదని రాసుంది'' అన్నాడు. అది నీ గురించి కాదుకదా నేను అన్నాను. కావొచ్చు కానీ అందులో ఈ యువ హీరో జాగ్రత్త పడకపోతే ఉదయకిరణ్‌ గతే పడుతుంది అని రాసింది. నన్ను ఉదాహరణగా చూపడం బాధిస్తోందని’’ నాతో వాపోయాడు అంటూ నరేష్ తెలిపాడు.

అది విన్నాక నేను చాలా బాధపడ్డాను. ఒక వ్యక్తి సక్సెస్ రేటులో ఉన్నప్పుడు ఆకాశానికి ఎత్తేసే వాళ్లు... అదే వ్యక్తి ఫెయిలయినప్పుడు మాత్రం తీసి నేలకు పడేస్తుంటారు. ఇది ఎంతవరకు సమంజసం, అందుకే సక్సెస్.. అయినా ఫెలయినా ఒకేలా ఉండాలని ఆనాడే డిసైడ్ అయ్యాను అని వివరించాడు. ఉదయ్ కిరణ్ చావుకి ఇదే కారణమని ఖచ్ఛితంగా చెప్పలేం. కానీ, గెలుపోటములను సీరియస్ గా తీసుకుంటున్న ఈ రోజుల్లో మనం రాసే కథనాలు వారిపై ప్రభావం మాత్రం ఖచ్ఛితంగా చూపుతుంటాయి. అందుకే ఇలాంటి వాటిని తగ్గించుకుంటే మంచిదన్నదే మా అభిప్రాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uday Kiran's Suicide  Allari Naresh  Aritle in news paper  

Other Articles