గోపిచంద్ హృతిక్ ఎవరి బలం గొప్ప? | Hritik Roshan Kaabil telugu and Gopichand new movie same title

Hritik kaabil and gopichand movie same title

Hritik Roshan Kaabil telugu version title, Balam title for Hritik, Hritik versus Gopichand, Gopichand hritik on same title, Same title for Hritik and Gopichand, Balam title for, Gopichand Hritik Roshan Balam, Gopichand new movie title, Gopichand B.Gopal Movie title

Hritik Roshan Kaabil telugu version and Gopichand new movie fixed same title Balam.

ఒకే టైటిల్ రెండు సినిమాలు ఏంటిది?

Posted: 10/24/2016 11:46 AM IST
Hritik kaabil and gopichand movie same title

ఒకే సినిమాకు రెండు టైటిళ్లు ఫిక్స్ చేయటం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒకటి నేరుగా తెలుగు సినిమా కాగా, మరోకటి హిందీ నుంచి డబ్బింగ్ కాబోతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ అప్ కమింగ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ "కాబిల్". జనవరి 26న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రాన్ని తెలుగు లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. హృతిక్ సరసన యామీ గౌతమ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి తెలుగులో  "బలం" అనే టైటిల్ ను ఫిక్స్ చేసేశారు.

అయితే ఇదే టైటిల్ తో ఈ మధ్యే ఓ తెలుగు సినిమా అనౌన్స్ చేయటం విశేషం. గోపీచంద్ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో అప్పుడెప్పుడో ఓ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కాకుండా ఆగిపోయింది. నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి కూడా బలం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. దీపావళికి చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి నవంబర్ ఎండింగ్ లో చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

 అల్రెడీ వారం క్రితమే గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ అంటూ బలం గురించి మొత్తం డీటెయిల్స్ అనౌన్స్ చేసేశారు. ఇంతలో కాబ్లీ టీజర్ వచ్చాక ఇప్పుడు తెలుగు వర్షన్ కోసం బలం అనే టైటిల్ ను ఇస్తున్నట్లు చెప్పేశారు. మరి ఈ రెండింటికి క్లాష్ ఆఫ్ ది టైటిల్ జరగదంటారా? లేదా హృతిక్ కాబ్లీ అలా ఏదైనా ట్యాగ్ లైన్ తగిలిస్తారా? మాస్ లో మంచి ఇమేజ్ ఉన్న గోపీచంద్ కోసమే టైటిల్ మారుస్తారా? చూద్దాం.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hritik Roshan Kaabil  Telugu version title  Balam  Gopichand new movie  

Other Articles