బాహుబలి 2 శివుడి ఉగ్రరూపం | Baahubali 2 Prabhas look released

Baahubali 2 prabhas look released

Prabhas firstlook from Baahubali The Conclusion, ferocious prabhas for Baahubali 2, Ferocious Shivudu for Baahubali 2, Prabhas firstlook from Baahubali 2, Baahubali Prabhas Birthday Poster, Baahubali 2 Prabhas

Prabhas's firstlook from Baahubali The Conclusion released.

శివుడి ఉగ్రరూపంతో బాహుబలి 2 లుక్

Posted: 10/22/2016 05:45 PM IST
Baahubali 2 prabhas look released

యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. చరిత్ర సృష్టించబోయే మరో సినిమా టీజర్ వచ్చేసింది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ చేసేలా బాహుబలి ది కంక్లూజన్ ఫస్ట్ లుక్ ను వదిలాడు దర్శకధీరుడు రాజమౌళి. ముంబై లో ముంబ‌యిలో మామీ ఫిలిం ఫెస్టివ‌ల్‌ 2016లో ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను కాసేపటి క్రితం రిలీజ్ చేసేశారు.

ముందుగా చెప్పినట్లు 4 గంటలకు కాకుండా, ఓ గంట ఆలస్యంగా ఫస్ట్ లుక్ వదిలాడు. తానే వెయిట్ చేయలేకపోతున్నానంటూ, తన అపారమైన శక్తితో మాహిష్మతి రాజ్యాన్ని ఎలా గెలుచుకున్నాడో తెలియజేసే లుక్ అంటూ ట్వీట్లతో కాసేపు సస్పెన్స్ రేపాడు. కాసేపు రాజీవ్ మసంద్, అనుపమ్ చోప్రాలతో సంభాషణ ముగిశాక ఎట్టకేలకు పోస్టర్ ను వదిలారు.

శివుడి పాత్రలో ఉన్న ప్రభాస్ చేతిలో ఖడ్గంతో, మరో చేతికి గొలుసు చుట్టుకుని నడిచి వస్తుంటే... వెనకాల బ్యాగ్రౌండ్ లో ఆకాశంలో మెరుపుల మధ్యలో తండ్రి బాహుబలి చూస్తున్నట్లు ఉన్న ఆ పోస్టర్ టోటల్ గా రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. బహుశా భల్లాలదేవుడిని తుదముట్టించేందుకే ఆ వీరుడి అలా నడిచివస్తున్నాడేమో అన్న చందాన ఆ పోస్టర్ ఉంది. అయితే బ్యాగ్రౌండ్ లో హిందీ వర్షన్ వినిపించాడే గానీ, తెలుగుకు సంబంధించిన వాసన లేకపోవటం, టీజర్ లా కాకుండా కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ వదలటం కాస్త నిరాశ కలిగించేదే. మరికాసేపట్లో తెలుగు వర్షన్ పోస్టర్ ని ఏమైనా రిలీజ్ చేస్తాడేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Birthday poster  Baahubali 2  

Other Articles