మహేష్ ఫస్ట్ లుక్ ఆయన లీక్ చేసేశాడు | Ace Camreman reveal mahesh look from Murugadoss Movie

Santosh sivan reveal mahesh firstlook from murugadoss movie

Mahesh firstlook from Murugadoss Movie, Ace Camreman Santosh Sivan reveal mahesh look, mahesh look from Murugadoss Movie, Mahesh pic with Kids, Agent Mahesh Firstlook, Murugadoss agent enjoy with Hyderabadi Kids

Ace Camreman Santosh Sivan reveal mahesh look from Murugadoss Movie in his twitter.

మహేష్ ఫస్ట్ లుక్ అబ్బే...

Posted: 10/22/2016 01:59 PM IST
Santosh sivan reveal mahesh firstlook from murugadoss movie

మహేష్ బాబు మురగదాస్ చేస్తున్న సినిమాకు టైటిల్ ఏంటో తెలియదు. ఫస్ట్ లుక్ ఎప్పడొస్తుందో తెలీదు. మహేష్ మాత్రం సరికొత్త లుక్ లో దర్శనమిస్తాడని ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు. ఇంత కాలం రాత్రి పూట షూటింగ్ లతో బిజీ అయిన సూపర్ స్టార్ ను ఈ మధ్యే లైట్ షెడ్యూల్ లోకి మార్చేశాడు. హైదరాబాద్ లో రోడ్లపై, ఇంకా ప్రత్యేకంగా వేసిన సెట్లలో యాక్షన్ సీక్వెన్స్ లు తీస్తున్నారు. ఇదిలా ఉండగా మహేష్ లుక్ పై క్లారిటీ వచ్చేసింది.

జాతీయ అవార్డు గ్రహీత సంతోష్ శివన్ ఈ సినిమాకు కెమెరామెన్ గా పని చేస్తున్నాడు. ఇప్పటిదాకా లోకేషన్లు, పీటర్ హెయిన్స్ లుక్స్ పంచుకున్న ఆయన ఇప్పుడు ఏకంగా మహేష్ లుక్ నే పెట్టేశాడు. మహేష్ ను మధ్యలో పెట్టేసుకుని చుట్టూ స్కూల్ పిల్లలు కేరింతలు కొడుతున్న పిక్ ను తన ట్విట్టర్ లో పెట్టేశాడు.  ఆ ఫోటోలో మహేష్ లుక్ నార్మల్ గానే ఉన్నప్పటికీ ఫిట్ నెస్ మాత్రం కాస్త వేరియేషన్ చూపే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనా దీపావళి కంటే మహేష్ లుక్ బయటికి ఇలా వచ్చేయటంతో ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు.

మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్న ఈ చిత్ర టైటిల్ పై కూడా ఆరోజే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఖుషీ దర్శకుడు ఎస్ జే సూర్య విలన్ గా నటించబోతున్న ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ మెరవబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Mahesh Babu  Murugadoss Movie  Mahesh Look  

Other Articles