పోలీసులను దించైనా సినిమా రిలీజ్ చేయిస్తానంటున్న రాజ్ నాథ్ సింగ్ | Rajnath Singh assured for Ae Dil Hai Mushkil release

Rajnath singh assured for ae dil hai mushkil release

Rajnath Singh assured for Ae Dil Hai Mushkil, ADHM producers meet Rajnath Singh, Rajnath Singh assured for Ae Dil Hai Mushkil, ADHM with police protction, Central assure for ADHM, Babul Supriyo MNS, Babul Supriyo attack, Babul Supriyo ADHM

Rajnath Singh assured for Ae Dil Hai Mushkil release.

ఆ సినిమాకు పోలీస్ భద్రత ఖాయం

Posted: 10/20/2016 04:31 PM IST
Rajnath singh assured for ae dil hai mushkil release

ప్రస్తుతం దేశం దృష్టంతా ఆ ఒక్క సినిమా మీదే ఉంది. కారణం దానిపై నెలకొన్న వివాదాలు అలాంటివి మరి. రిలీజ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ ఆ చిత్ర నిర్మాతల్లో టెన్షన్ నానాటికీ పెరిగిపోతుంది. మాట్లాడేది యే దిల్ హై ముష్కిల్ గురించే.... మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చిత్ర రిలీజ్ ను అడ్డుకుని తీరతామంటూ హెచ్చరించిన నేపథ్యంలో ఈ రోజు నిర్మాతలంతా కలిసి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు.

తొలినాటి నుంచి చిత్ర నిర్మాత కరణ్ జోహర్ కు మద్ధతుగా మాట్లాడుతున్న ముకేష్ భట్, ఇతర నిర్మాతలతో కలిసి రాజ్ నాథ్ ను కలిసి రిలీజ్ కోసం చర్చించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా సినిమా రిలీజ్ అయ్యేలా చూస్తానని రాజ్ నాథ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. లోపలికి వచ్చే ముందు ఎలా స్పందిస్తారో అని టెన్షన్ పడ్డాను. కానీ, ఆయనతో మాట్లాడాక సినిమా రిలీజ్ అవుతుందన్న ధైర్యం వచ్చింది అని సమావేశం తర్వాత ముకేష్ మీడియాకు తెలిపాడు. అవసరమైతే పోలీస్ భద్రత కల్పించేందుకు కూడా సిద్ధమని రాజ్ నాథ్ ప్రకటించినట్లు సమాచారం.

ఇక నిర్మాతలతో ఉన్న సింగర్ కమ్ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ఎంఎన్ఎస్, దాని అధినేత రాజ్ థాక్రే పై నిప్పులు చెరిగారు. సినిమా ధియేటర్లపై దాడులు చేసే హక్కు ఎంఎన్ఎస్ కు కు లేదని, అది ఒక రౌడీల పార్టీ అని దుయ్యబట్టారు. బ్లాక్ మెయిల్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ప్రేక్షకులు ఏ సినిమా చూడాలో, చూడకూడదో నిర్ణయించే అధికారం ఎంఎన్ఎస్ కు లేదని, దయచేసి శాంతిభద్రతలకు భంగం కలిగించొద్దని విజ్నప్తి చేశాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ADHM  Union minister Rajnath Sigh  Babul Supriyo  MNS  

Other Articles