కోడి కూర మొత్తం ఖరాబు అయ్యింది | nagabharanam movie review

Nagabharanam movie review

nagabharanam review, Nagabharanam talk, Nagabharanam fails at box office, Nagabharanam Kodi Ramakrishna,

Kodi Ramakrishna dissappoints with Nagabharanam movie.

కోడి కూర మొత్తం నాశనం అయ్యింది

Posted: 10/15/2016 05:48 PM IST
Nagabharanam movie review

ఒక సినిమాపై అంచనాలు పెరగడానికి అందులో స్టార్ క్రూ నే ఉండాల్సిన అవసరం ఇప్పటి రోజుల్లో లేదు. అందుకు దర్శకుడి చరిష్మా ఉన్నా సరిపోతుంది. అలాగే గ్రాఫిక్స్ జోనర్ సినిమాలపై మాంచి పట్టు ఉన్న సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణకు ముఖ్యమైన కథను మిస్సవుతాడని ఎవరైనా అనుకుంటామా చెప్పండి. చాలా గ్యాప్ తర్వాత ఆయన డైరక్షన్లో వచ్చిన నాగభరణం పరిస్థితి ఇప్పుడు అలాగే తయారయ్యింది.

శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించాడు, పైగా సీనియర్ దర్శకుడు అన్న నమ్మకంతో నాగభరణం థియేటర్లకు వెళ్లిన జనాలకు జడుపు జ్వరాలు తెప్పించాడాయన. అసలు అమ్మోరు లాంటి చిత్రంతో తెలుగులో గ్రాఫిక్స్ ప్రధాన చిత్రాలకు శ్రీకారం చుట్టిందే ఆయన. కేవలం స్వదేశీ టెక్నాలజీని, పరిమిత బడ్జెట్ లోనే చూపించిన ఘనత ఆయనది. అరుంధతి తర్వాత తెలుగులో అవతారం అనే సినిమా తీసినప్పటికీ, అది ఎప్పడు రిలీజై ఎప్పుడు పోయింది తెలీదు. ఇక ఇప్పుడు తొలిసారి కన్నడలో చేసిన సినిమా ‘నాగరహవు’ను తెలుగులో నాగభరణం పేరుతో విడుదల చేశాడు.

దశాబ్దం కిందటే చనిపోయిన కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్ ను తిరిగి తెరమీద పున:సృష్టించే ప్రయత్నం చేయడం ద్వారా ఈ సినిమాపై జనాల్లో ఆసక్తి రేకెత్తించారు. దీనికి తోడు గ్రాఫిక్స్ ప్రధానంగా కోడి రామకృష్ణ సినిమాలు చాలా వరకు విజయవంతమైన నేపథ్యంలోనూ ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. అయితే అందులో ఆ రెండే మెయిన్ మైనస్ లుగా మారాయి. కథలో అసలు పస లేకపోగా, గ్రాఫిక్స్ మరీ టూమచ్ హెవీ అయిపోయాయి. ఇక చంద్రముఖి తరహాలో పెట్టాలనుకున్న సస్పెన్స్, రమ్య, సాయి కుమార్ లాంటి తారాగణం యాక్షన్ లు సిల్లీగా మారిపోయాయి. మ్యూజిక్ విభాగంలోనూ లౌడ్ నెస్ ఎక్కువయి టోటల్ గా అంతా వేస్ట్ అయిపోయింది.

ఇక హైలెట్ అవుతుందని భావించిన విష్ణువర్థన్ సీక్వెన్స్ అంతా బూడిదలో పోసిన పన్నీరులా మారిపోయింది. ఎవరిదో తల అతికించినట్లు చేసిన ప్రయోగం వికటించింది. మొత్తానికి కోడి రామకృష్ణ ఇప్పటిదాకా అందించిన సినిమాల్లో కింది స్థాయి లో టాప్ గా నిలిచింది ఈ నాగభరణం. అన్నట్లు కన్నడలో కూడా ఈ చిత్రానికి అంతంత టాక్ మాత్రమే వచ్చిందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagabharanam  Review  Kodi Ramakrishna flop show  

Other Articles