అప్ డేట్ అవండ్రా అంటున్న కాజల్ | Kajal suggests actresses to update every day

Kajal agarwal till learning actress

Kajal suggests actresses to update every day, Kajal Agarwal about seniority, kajal agarwal till learning

Kajal Agarwal classes to Actresses to update. says even senior she still learning acting.

కాజల్ హిట్ సినిమాలపై విమర్శలు

Posted: 10/08/2016 11:52 AM IST
Kajal agarwal till learning actress

హీరోయిన్లు కెరీర్ ముందుకు వెళ్తున్నా కొద్దీ నటనలో ఇంప్రూమెంట్ చూపిస్తుంటారు. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పే సమయమానికి వారి పరిణితికి మంచి మార్కులే పడతాయి. అయితే కాజల్ పరిస్థితి మాత్రం అలా కాదు. ఇంకా నేర్చుకనే దశలోనే ఉంది. ఈ మాటలు అంటోంది ఎవరో కాదు స్వయానా ఆ చందమామే. ‘‘నేర్చుకోవడం, మార్పు కోరుకోవడం, మనల్ని మనం ఆవిష్కరించుకోవడం’’.. ఈ లక్షణాలు ప్రతి హీరోయిన్‌లోనూ ఉండాలని పేర్కొంది.

తాను సినీ పరిశ్రమలోకి వచ్చి పదేళ్లు కావస్తున్నా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నానని తెలిపింది. ప్రతీ రోజూ అప్‌డేట్ అవుతుంటానని, కొత్తగా ఇంకేమి చేయగలమనే విషయాన్ని ఆలోచిస్తుంటానని కాజల్ పేర్కొంది. చందమామ, మగధీర, మిస్టర్ పెర్‌ఫెక్ట్, బృందావనం, తుపాకీ వంటి సినిమాలు చేసినా నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయడం లేదనే విమర్శ తనపై ఉందని, అందుకే కథల ఎంపికపై ఇక నుంచి మరింతగా దృష్టి సారించాలని అనుకుంటున్నట్టు తెలిపిందీ ముద్దుగుమ్మ. కథ కన్విన్సింగ్‌గా ఉందా? లేదా? ఆ పాత్రకు న్యాయం చేయగలనా? అనే ఆలోచిస్తాను తప్ప మరో హీరోయిన్ గురించి ఆలోచించని కాజల్ వివరించింది.

బ్రెయిన్ కంటే తన హృదయం చాలా గట్టిదని పేర్కొన్న కాజూ అందుకే టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండాలని తోటి నటీమణులకు సలహా ఇచ్చింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఖైదీ నంబర్ 150’తోపాటు మరో మూడు తమిళ చిత్రాలు, ఓ కన్నడ చిత్రంలో సౌత్ లో తెగ బిజీగా ఉంది కాజల్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kajal Agarwal  about seniority  learning acting  

Other Articles