మహేష్ - మురగదాస్ దీపావళి ధమాకా | Murugadoss promise Mahesh fristlook on Diwali

Murugadoss promise mahesh fristlook on diwali

AR Murugadoss promises Mahesh firstlook, Murugadoss-Mahesh Firstlook on Diwali, Mahesh Diwali Dhamaka, Mahesh Murugadoss Firstlook, Mahesh Murugadoss Bi lingual Firstlook, Mahesh Murugadoss Firstlook and title

మహేష్ - మురగదాస్ దీపావళి ధమాకా | Murugadoss promise Mahesh fristlook on Diwali

మహేష్ ఫస్ట్ లుక్ దసరాకి మిస్ కానీ...

Posted: 10/03/2016 12:36 PM IST
Murugadoss promise mahesh fristlook on diwali

టాలీవుడ్ తోపాటు కోలీవుడ్ లోనూ ఓ సినిమా గురించి తీవ్రంగా డిస్కషన్ జరుగుతోంది. కారణం సౌత్ లోనే కాదు.. ఓవరాల్ ఇండియా వైడ్ గా అభిమానులను ఏర్పరుచుకున్న మహేష్ బాబుతో మురగదాస్ జతకట్టడమే. టాప్ సీక్రెట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఒక్క లీక్ కూడా ఇప్పటి దాకా కాలేదు. అందుకు తగ్గట్లుగానే ఇప్పటిదాకా అంతా నైట్ అవుట్ లోనే షూటింగ్ కానిస్తున్నాడు మురగదాస్.  .  

హైదరాబాద్ టూ చెన్నై, చెన్నై టూ హైదారాబాద్ ఇలా సాగుతోంది ఈ చిత్ర షెడ్యూల్. ప్రస్తుతం మహేశ్ తదితరులపై హైదరాబాద్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదే సమయంలో దసరా పండుగ దగ్గర పడుతుండటంతో, మహేశ్ బాబు మూవీ నుంచి ఫస్టులుక్ వస్తుందేమోననే ఆసక్తితో అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే అది కుదరకపోవచ్చని సమాచారం అందుతోంది.

తెలుగు.. తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా ఫస్టు లుక్ ను విడుదల చేయనుకోవటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఫస్టులుక్ తోపాటు, టైటిల్ ను రివీల్ చేస్తూ ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెంచాలనే ఆలోచనలో మురుగదాస్ వున్నాడట. అందుకే దీపావళికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. మురుగదాస్ కి గల ఇమేజ్ .. మహేశ్ బాబుకి గల క్రేజ్ .. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని ఈ ఫస్ట్ లుక్ ఉండబోతుందని సమాచారం. కోలీవుడ్ దర్శకుడు ఎస్. జె.సూర్య విలన్ 8 ప్యాక్ లో నటిస్తుండటం, మహేష్ ఐబీ ఆఫీసర్ రోల్ చేస్తుండటంతో ఈ చిత్రానికి  మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AR Murugadoss  Mahesh Babu  Firstlook  Diwali  

Other Articles