ఆ హీరో, సన్నీలియోన్ సేమ్ టూ సేమ్ | Funny reactions from Public for Sivakarthikeyan's Remo getup

Siva karthikeyan s remo trailer record in youtube

Funny reactions for Remo Trailer, Public fun on Sivakarthikeyan's Remo getup, sunny leone or Siva karthikeyan, Hero compared with Sunny leone and Amy Jackson

Siva karthikeyan's remo trailer record in Youtube. Funny reactions from Public for Sivakarthikeyan's Remo getup.

హీరో ఆడ గెటప్ అంత ఘోరంగా ఉందా?

Posted: 09/23/2016 06:12 PM IST
Siva karthikeyan s remo trailer record in youtube

హీరోలు మచ్చుకు ఆడ గెటప్ లు వేస్తే సినిమాకి అదనపు ఆకర్షణ ఉంటుందని అంతా అనుకుంటారు కానీ, ఓ సినిమా మొత్తం ఆ కథాంశం చుట్టే తిరిగితే ఎలా ఉంటుంది. ప్రస్తుతం కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తీకేయన్ రెమోతో అలాంటి ప్రయోగమే చేయబోతున్నాడు. నాలుగు రోజుల క్రితం ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కాగా, యూట్యూబ్ లో మూడున్నర మిలియన్ హిట్లతో సంచలనంగా మారింది.

సినిమాల పిచ్చి ఉన్న ఓ యువకుడు డైరక్టర్ కేఎస్ రవికుమార్ సలహాతో ఆడగెటప్ లోకి మారిపోతాడు. అక్కడి నుంచి అతని జీవితం మలుపు ఎలా తిరుగుతుంది. చివరకు అనుకున్నది సాధిస్తాడా అన్న కథనంతో చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో ఎక్కువ సేపు శివ లేడీ గెటప్ లోనే కనిపించనున్నాడు. యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి హైప్ పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయి. మల్లూ బ్యూటీ కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత పీసీ శ్రీరాం కెమెరామెన్ గా పని చేస్తుండగా, ఆస్కార్ విన్నర్ రసూల్ పుకుట్టి సినిమాకు సౌండ్ ఎడిటింగ్ అందజేస్తున్నాడు. ఇక స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ స్పెషలిస్ట్ అరసు స్టంట్స్ సమకూరుస్తుండగా, యంగ్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూరుస్తుండగా, బక్కీయరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నాడు. టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్న ఈ చిత్రం అక్టోబర్ లో రిలీజ్ కానుంది.

ఇక ఈ చిత్రంలోని హీరో లేడీ గెటప్ ఫోటోతో ఓ చానెల్ వారు చేసిన ప్రయోగం నెట్ లో వైరల్ గా మారింది. ఓ యాంకర్ లేడీ గెటప్ లో శివకార్తీకేయన్ ఫోటోను చూపించి ఎవరని అడిగితే... చాలా మంది సన్నీలియోన్ అని చెప్పటం విడ్డూరం. ఇంకొందరైతే అమీ జాక్సన్ చెప్పగా, మరికొందరు తమకు తెలీదని చెప్పుకోచ్చారు. చివరాఖరికి అందులో ఉంది శివకార్తీకేయన్ అని చెబితే అతనెవరు అని అడగటం కొసమెరుపు. ఫన్నీగా ఎడిట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారిపోయింది.  కాగా, అరడజను పైగా చిత్రాలతో కోలీవుడ్ లో శివకార్తీకేయన్ ఇప్పుడిప్పుడే మంచి హీరోగా ఎదుగుతున్నాడు. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Funny reactions  Remo trailer  Siva karthikeyan  youtube  

Other Articles