అప్పుడెప్పుడో బాలయ్య ఇప్పుడు రామయ్య | Janatha Garage 3rd Highest grosser in tollywood

Janatha garage 3rd highest grosser in tollywood

Janatha Garage 3rd Highest grosser in tollywood, Nandamuri Movie in tollywood top ten, Mega Movies Exit from Top 3, NTR full stop to mega record, Pawan AD NTR janatha garage, NTR Garage cross pawan AD, Mega Movies exit from top 3

Janatha Garage 3rd Highest grosser in tollywood, Mega Domination Ends after 15 Years.

ఒక్క దెబ్బకి మెగా ట్రాక్ తారుమారు

Posted: 09/19/2016 04:23 PM IST
Janatha garage 3rd highest grosser in tollywood

తెలుగులో ఆల్ టైం గ్రాసర్ టాప్ మెగా ఫ్యామిలీ చిత్రాలు ఖచ్ఛితంగా ఉండితీరతాయి. మధ్యలో ఎవరెన్ని మ్యాజిక్ లు చేస్తున్నా మెగా ఫ్యామిలీకి చెందినంత వరకు ఆ రికార్డు మాత్రం సేఫ్ గానే ఉండిపోయింది. అయితే 15 ఏళ్ల క్రితం నందమూరి ఫ్యామిలీ క్రియేట్ చేసిన ఈ రికార్డుల పర్వంలో ఇంతకాలం ఆ వంశానికి చెందిన ఒక్క హీరో చిత్రం కూడా నిలవకపోవటం విశేషం.

2001 సంవత్సరంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో నందమూరి బాలకృష్ణ ఈ రేసులో ముందంజలో ఉండగా, ఆ ఇయర్ జాబితాలో నరసింహానాయుడు, సమరసింహారెడ్డి, తరుణ్ నువ్వే కావాలి చిత్రాలు టాప్ 3 గా ఉన్నాయి. ఆ తర్వాత ఖుషీతో ఆ రికార్డులను చెరిపేశాడు పవన్. ఇక మరుసటి సంవత్సరం ఇంద్రతో చిరంజీవి టాలీవుడ్ ఆల్ టైం రికార్డును అందించాడు.

ఆపై 15 ఏళ్లపాటు నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్కటంటే ఒక్క చిత్రం కూడా కలెక్షన్లపరంగా సునామీ సృష్టించలేకపోయింది. హవా మొత్తం మెగా ఫ్యామిలీ నుంచే కొనసాగుతూ వస్తోంది. మగధీర, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, సరైనోడు, రేసు గుర్రం అన్ని ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినవే. మధ్యలో దూకుడు, సీతమ్మ వాకిట్లో, శ్రీమంతుడు లతో మహేష్, బాహుబలితో ప్రభాస్ రికార్డులు సృష్టించుకుని జాబితాను తారుమారు చేసినప్పటికీ, ఆ జాబితా మూడో స్థానం నుంచి మాత్రం మెగా ఫ్యామిలీ ఎగ్జిట్ కాలేకపోయింది. కానీ, దశాబ్దంన్నర తర్వాత ఫస్ట్ టైం నందమూరి ఫ్యామిలీకి చెందిన ఓ హీరో సినిమా టాప్ 3 లో నిలవటం ఇప్పుడు చర్చకు దారితీసింది.

జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ నెగటివ్ టాక్ తో మొదలైనప్పటికీ తెలుగులో బాహుబలి తర్వాత దాదాపు రికార్డులన్నీ క్రియేట్ చేసింది. ఈయేడాది వచ్చిన సరైనోడుతోసహా ఇప్పటిదాకా టాలీవుడ్ క్రియేట్ చేసిన రికార్డులన్నీ చేరిపేసి మూడో స్థానంలో నిలిచింది. విడుదలై రెండు వారాలు పూర్తయినప్పటికీ గ్యారేజ్ ప్రభంజనం ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతూనే ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : NTR  Janatha Garage  Tollywood  3rd higest grosser  

Other Articles