హాట్, నాటీ అన్నందుకు క్లాస్ పీకింది | amala paul serious on tweet about hot avatar

Amala paul serious on tweet about hot avatar

Amala Paul serious on hot and naughty tweet, Amala Paul hot avatar at Celebrity Badminton league, Amala Paul fire on hot avatar tweet, Amala Paul fire on divorce woman tweet

Amala Paul serious on tweet about hot avatar at launch of Celebrity Badminton league

హాట్ అన్నందుకు అంతగా ఫీలవ్వాలా?

Posted: 09/19/2016 12:58 PM IST
Amala paul serious on tweet about hot avatar

నటి అమలాపాల్ విడాకులు యవ్వారం మూలంగా గత మూడు నెలలుగా మీడియా పండగ చేస్కోంటోంది. వార్తలు బయటికి వచ్చినప్పటి నుంచి పుకార్లతో మొదలుపెట్టి, అది కన్ఫర్మ్ అయ్యాక అందులోని నిగూఢ కారణాలను విశ్లేషణ చేసి ఎవరికి తోచిన రీతిలో వారు రాసేశారు. అయితే సినిమాలో నటించడం అన్న ఒక్క కామన్ పాయింట్ ను మాత్రం అందరూ చూపించగలిగారు. ఎందుకంటే కారణం అదే కదా మరి. కొన్ని రోజులు అజ్నాత వాసంలో ఉన్న అమల మొన్నామధ్యే మనసుకు నచ్చిన పనికి అడ్డుతగిలే ఎవరినైనా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పటం తెలిసిందే.

సినిమాల్లో నటించాలన్న తన కోరికకు భర్త అండ్ ఫ్యామిలీ అడ్డుపడటం మూలంగానే ఆమె దూరమైందన్న విషయాన్ని చెప్పకనే చెప్పింది. అయితే వ్యవహారం ఎలాగూ చివరి దశలో ఉంది కాబట్టి ఇక తనకేం సంబంధం లేదన్నట్లు మునుపటిలా కార్యక్రమాలకు, ఈవెంట్లకు హాజరయిపోతుంది. రెండు రోజుల క్రితం చెన్నైలో జరిగిన బ్యాడ్మింటన్ లీగ్ కార్యక్రమానికి అటెండయ్యింది. భర్తకు దూరమైన తర్వాత కాస్త హాట్ అవతారంలో కనిపించడంతో సోషల్ మీడియాలో ఆమెపై జోకులు పేలాయి.

ఒక యువకుడు ఓ అడుగు ముందుకు వేసి ''విడాకులు తీసుకున్న ఆడాళ్లు హాట్ గా .. నాటీగా వుంటారు'' అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. అంతే అగ్గిమీద గుగ్గిలం అయిన అమలా కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చింది. '' నీ ఆలోచనలు తప్పుడు దారిలో వెళుతున్నాయి. స్త్రీలను గౌరవించడం నేర్చుకో'' అంటూ కౌంటర్ ఇచ్చింది. విడాకుల నేపథ్యంలో ఆమెకు అవకాశాలు రాకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దశలో మరిన్ని ఎక్కువ అవకాశాలు సంపాదించుకోవాలనే పట్టుదలతో ఆమె ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదనే పలువురు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amala Paul  Hot And Naughty  Tweet  serious  

Other Articles