మోహన్ బాబు ఎక్సయిట్ మెంట్ లో అర్థముంది | mohan babu excited on 40 years industry

Mohan babu excited on 40 years industry

Mohan Babu excited 40 years, Navarasa natatilakam Mohan Babu, Mohan Babu thanks to dasari, TSR foundation Mohan Babu, Mohan Babu on 40 years industry celebrations

Mohan Babu about his 40 years industry and honored with Navarasa natatilakam.

మోహన్ బాబు ఎందుకంత ఎక్సయిట్ అవుతున్నాడు?

Posted: 09/15/2016 01:19 PM IST
Mohan babu excited on 40 years industry

టాలీవుడ్ లో డైలాగ్ డెలివరీలో పటుత్వంతో తమకంటూ ఓ మేనరిజం క్రియేట్ చేసుకున్న వారు అతికొద్ది మంది మాత్రమే. ఈ విషయంలో అగ్రహీరోలను మినహాయిస్తే ఎస్వీఆర్, జగ్గయ్య, రావుగోపాల రావు లాంటి కొద్ది పేర్లు మాత్రమే మనకు వినిపిస్తాయి. ఈతరం వారిలో ప్రకాశ్ రాజ్, రావు రమేష్ లాంటి వాళ్లు ఆ లోటును భర్తీ చేసేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు. కానీ, అందరికన్నా మోహన్ బాబు మాత్రం సమ్ థింగ్ స్పెషల్. విలన్, హీరో, సైడ్ పాత్రలు, గెస్ట్ రోల్స్ ఇలా దేన్నీ వదలకుండా అన్ని పాత్రల్లో ఒదిగిపోతూ, మరోపక్క నిర్మాతగా ఇలా నాలుగు దశాబ్దాలపాటు తెలుగు చిత్ర సీమలో కొనసాగటం అంటే మాములు విషయం కాదు.  

ఇక ఆయన 40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం పై జరుగుతున్న అభినందన వేడుకల్లో ఈ భక్తవత్సలనాయుడిని(అసలు పేరు) నవరస నటతిలకం బిరుదుతో ఆయన్ని సత్కరించబోతుంది టీఎస్ఆర్ లలిత కళా పరిషత్. ఈ సందర్భంగా మోహన్ బాబు చాలా ఎమోషనల్ అవుతున్నారు. విశాఖలో జరిగే ఈ కార్యక్రమం కోసం అక్కడికి చేరుకున్న ఆయన మీడియాతో ముచ్చటించారు. తన గురువు దాసరితో పాటు అభిమానుల అండదండలతోనే ఇంతటివాడిని అయ్యానని చెప్పిన ఆయన, తన ప్రస్థానాన్ని సింపుల్ గా చెప్పేశాడు.  ‘ఆనాడు ఓ మారుమూల పల్లెటూరు నుంచి పొట్ట చేతపట్టుకుని చెన్నై వెళ్లాను. ఎన్నో ఇబ్బందులు పడ్డా.. ఎదురు దెబ్బలు తిన్నాను. మరెన్నో ఒడిదుడుకులు చవిచూశాను. గురువుగారు దాసరి నారాయణరావు నన్ను మోహన్‌బాబుగా మార్చి తెలుగు ప్రజలకు పరిచయం చేశారు. ఆయన  ప్రోత్సాహం, మా తల్లిదండ్రుల ఆశీస్సులు, అభిమానుల దయవల్ల ఎన్నో విజయాలందుకున్నాను. తర్వాత బి.గోపాల్, రాఘవేంద్ర రావు లాంటి దర్శకులు హిట్లు అందించి నన్ను నిలబెట్టారు. ఫలితం ఇంత మంది తెలుగు ప్రజల అభిమానాన్ని చురగొనగలిగాను.

తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు నాకోసం విశాఖకు తరలివస్తున్నారు. వారందరికీ నాదో విన్నపం. పూలదండలు, బొకేలు తేవొద్దు. ఆ డబ్బుతో అన్నార్తులకు పట్టెడన్నం పెట్టండి, అదే నేనెంతో సంతోషించే విషయం అవుతుంది అని తెలిపాడు. ఈ 40 సంవత్సరాలూ ఎలా గడిచిపోయాయో తెలియడం లేదన్న మోహన్ బాబు, ఇప్పుడు తనతో పనిచేసిన వారంతా వచ్చి అభినందనలు చెబుతుంటే వాటిని స్వీకరిస్తూ, ఆనందంగా ఉన్నానని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీర్వాదం ఎళ్లవేళలా ఉండాలి. ఊపిరి ఉన్నంత వరకు మీ ఆదరాభిమానాలతో కళామతల్లికి సేవ చేస్తూనే ఉంటా అంటున్నాడు ఈ విలక్షణ నటుడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohan Babu  TSR Honour  Navarasa Natatilakam  40 years celebrations  

Other Articles