వందకోట్ల హీరోయిన్ కి ఏమైంది? | why Nimrat Kaur not sign for bollywood film

Why nimrat kaur not sign for bollywood film

Nimrat Kaur, Nimrat Kaur bollywood Carrier, Nimrat Kaur next movie, Nimrat Kaur new Project, Nimrat Kaur hollywood busy, Nimrat Kaur in Hollywood

Nimrat Kaur says why she not sign for Bollywood film.

ఆ వందకోట్ల హీరోయిన్ ఎక్కడ ఉంది?

Posted: 09/13/2016 05:29 PM IST
Why nimrat kaur not sign for bollywood film

ఒక మాములు హిట్ ఖాతాలో పడిందంటే హీరోయిన్ల కోసం క్యూ కడుతున్న రోజుల్లో, వందకోట్ల సినిమా అందించి కూడా ఇంతవరకు ఒక్కటంటే ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు ఎయిర్ లిఫ్ట్ హీరోయిన్ నిమ్రత్ కౌర్. అక్షయ్ కుమార్ పక్కన సినిమా విడుదలయి ప్రమోషన్ లో కనిపించిన ఆమె తర్వాత 8 నెలలుగా బాలీవుడ్ కు, అసలు ఇండియాకే దూరంగా ఉంటుంది. ఇంతకీ ఆమె ఎక్కడ ఉంది? అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది.

ప్రస్తుతం ఈ హాట్ ఆంటీ వేవార్డ్ పైన్స్ టీవీ షో షూటింగ్ లో బిజీగా ఉన్న నిమ్రతా ఆడి కారు కొత్త మోడల్ లాఛింగ్ ఈవెంట్ లో పాల్గొంది. ఈ సందర్భంగా చాలా విషయాలే పంచుకుంది. 'గడిచిన ఏడాదికాలంలో నేను ఎన్నో ఎదుర్కొన్నాను. ఎంతో ఉక్కిరిబిక్కిరిగా ఇది గడిచిపోయింది. జనవరిలో 'ఎయిర్ లిఫ్ట్' విడుదల అయింది. ఆ వెంటనే ఒకదాని వెంట ఒకటిగా చాలా విషయాలు జరిగిపోయాయి. ఇవన్నీ ఇలా ఉండగానే మా చెల్లి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి సందండి, సంబరంలో మునిగితేలుతుండగానే వాంకోవర్ నుంచి సీరియల్ ఆఫర్ వచ్చింది' అని నిమ్రత్ పేర్కొంది.

'లాంచ్ బాక్స్'లో నిమ్రత్ నటనను చూసి ముచ్చటపడ్డ అమెరికన్ టీవీ నిర్మాతలు ఆమెకు 'హోమ్ ల్యాండ్' సీరియల్ లో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ పాత్రను ఇచ్చారు. ఆ పాత్రలోనూ రాణించడంతో మనోజ్ నైట్ శ్యామలన్ రూపొందిస్తున్న టీవీ సిరీస్ 'వేవార్డ్ పైన్స్'లో అవకాశం వచ్చింది. ఇలా హాలీవుడ్ సీరియళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్న నిమ్రత్ త్వరలోనే అవకాశం దొరికితే బాలీవుడ్ సినిమాల్లో మళ్లీ కనిపిస్తానని చెప్తోంది. ఆమె ఊ అనాలేగానీ ఛాన్సులు ఇచ్చేందుకు మన మేకర్స్ క్యూ కట్టరంటారా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nimrat Kaur  Bollywood  New Movies  

Other Articles