మీలో ఎవరు కోటీశ్వరుడు, బాహుబలి హక్కులపై నాగ్ | nag condemns baahubali distribution rumours

Nag condemns baahubali distribution rumours

Nagarjuna condemns baahubali distribution, Nagarjuna Confirmed Chiranjeevi for MEK, Nagarjuna on Baahubali 2, Nagarjuna Chiru MEK, Nagarjuna Krishna Baahubali rights

Nagarjuna condemns baahubali distribution rumours and Confirmed Chiranjeevi for MEK.

ఆ ప్రచారం తో నాకు సంబంధం లేదు

Posted: 09/10/2016 01:08 PM IST
Nag condemns baahubali distribution rumours

ఎప్పటి నుంచో మీడియాలో నానుతున్న కొడుకుల పెళ్లిళ్ల వ్యవహారాలపై తాజాగా నాగ్ ఓ ప్రకటనతో ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నించాడు. సమంత కాబోయే కొడలు అని అంగీకరించడంతోపాటు, అఖిల్ ఎంగేజ్ మెంట్ డిసెంబర్ 9 అని అనౌన్స్ చేసేశాడు కూడా. ఇక వరుస సినిమాలు, హిట్లతో ఈతరం హీరోలకు పోటీగా ఉన్న నాగ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుని కుటుంబ వ్యవహారాలు చూసుకోవాలనుకుంటున్నాడంట. ప్రస్తుతం ఓం నమోవెంకటేశాయ లో నటిస్తున్న నాగ్ తర్వాత కొన్ని నెలలు గ్యాప్ ఇస్తున్నాడు.

ఈ క్రమంలోనే మా టీవీలో ప్రసారమయ్యే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై నాగ్ నిర్మలా కాన్వెంట్ చిత్ర ప్రమోషన్ లలో స్పందించాడు. ‘అవును...  నేను బ్రేక్ తీసుకున్నాననీ, ఆ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి యాంకర్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న మాట నిజమేనని అన్నాడు. అంతేకాదు చిరు రాక వలన ఈ కార్యక్రమం రేంజ్ మరింత పెరుగుతుంది’ అని చెప్పాడు.

ఇంకోవైపు డిస్ట్రిబ్యూటర్ అవతారమెత్తి మరో నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి బాహుబలి 2 కృష్ణా జిల్లా హక్కులను రూ.8 కోట్లకు నాగ్ సొంతం చేసుకున్నాడని ఓ ప్రకటన మీడియాకు విడుదలైంది. దీనిపై నాగ్ మాట్లాడుతూ... డిస్ట్రిబ్యూషన్ ఆలోచనలు తనకి లేవని నాగార్జున చెప్పారు. కొన్ని పుకార్లు ఎలా పుడతాయో తెలియదనీ, ఇది కూడా అలాంటి పుకారేనని ఆయన అన్నారు. ఇలాంటి ప్రచారాలు నమ్మవద్దని, ఎలాంటి విషయం ఉన్నా తానే స్వయంగా చెప్పేవరకు నిర్ధారణ చేసుకోకండని మీడియాకు సూచించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  baahubali distribution  rumour  

Other Articles